Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ లు ఇక మరింత కష్టం..! కేంద్రం కీలక మార్పు..!

దేశవ్యాప్తంగా రహదారులపై వాహనాలు నడిపేందుకు వీలుగా రవాణా శాఖ జారీ చేస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ లు (Driving Licence) ఇక మరింత కష్టతరం కాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్హతలు, ఇతరత్రా కారణాల వల్ల డ్రైవింగ్ లైసెన్స్ లు పొందలేక, అవి లేకుండానే వాహనాలు నడుపుతూ వాహనదారులు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం నిర్వహించే పరీక్షను కష్టతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ లు పొందడం మరింత కష్టతరం కాబోతోంది.

ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు..! కేంద్రం ఉత్తర్వులు జారీ..!
ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు..! కేంద్రం ఉత్తర్వులు జారీ..!

కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ (Morth) సురక్షిత డ్రైవింగ్ శిక్షణ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల శాతాన్ని 60 శాతం నుండి 75 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో, ఆధార్ ధృవీకరణ ద్వారా పొందే కొన్ని ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు నుండి మినహాయింపు కల్పించాలని కూడా ప్రతిపాదించింది. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలకు చేపడుతున్న ఈ మార్పుల లక్ష్యం మూల్యాంకన అవసరాలను కఠినతరం చేయడమేనని అధికారులు చెప్తున్నారు.

Driving Licence Test May Get Tougher MoRTH Proposes 75 Pass Mark
సీజేపీ వెనుక బీజేపీ ? మోడీ టార్గెట్ గా అన్నామలై తీవ్ర విమర్శలు..!
సీజేపీ వెనుక బీజేపీ ? మోడీ టార్గెట్ గా అన్నామలై తీవ్ర విమర్శలు..!

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలకు చేసిన ముసాయిదా సవరణలలో, సురక్షిత డ్రైవింగ్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు కొనసాగాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం లైసెన్సింగ్ అధికారులు పేరు, చిరునామాతో సహా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను మార్చడానికి చేసిన దరఖాస్తులను, తిరస్కరణకు గల కారణాలతో సహా 15 రోజులలోపు ఆమోదించాలి లేదా తిరస్కరించాలని చెబుతోంది. అలాగే లైసెన్స్ లో దరఖాస్తుదారుడి పేరు, చిరునామాతో సహా వ్యక్తిగత వివరాలలో మార్పులకు అయ్యే రుసుములను తొలగించాలని కూడా ఇది ప్రతిపాదిస్తోంది. దరఖాస్తుదారులు తమ గుర్తింపు, వయస్సు, నివాసానికి రుజువుగా ఇచ్చే పత్రాలను కూడా ఈ ముసాయిదా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ జాబితాలో ఆధార్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, ఇ-రేషన్ కార్డు, జనన ధృవీకరణ పత్రం వంటి పత్రాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ జారీ చేసే లేదా పునరుద్ధరించే ప్రతి డ్రైవింగ్ లైసెన్స్ ఫారం 7లో లామినేటెడ్ లేదా పాలీవినైల్ క్లోరైడ్ (PVC) కార్డు రూపంలో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+