
దేశంలో త్వరలో డ్రోన్ పాలసీ.. దాడుల నేపథ్యంలో నిర్ణయం: ప్రధాని మోడీ
ఇటీవల కశ్మీర్‌లో డ్రోన్ల కదలికల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాయాది/ ఉగ్ర కదలికల నేపథ్యంలో భారత్ కూడా డ్రోన్ పాలసీ తీసుకొస్తామని తెలిపింది. ఇవాళ సాయంత్రం హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. సమావేశంలో భద్రత పరమైన అంశాలు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా దేశంలో డ్రోన్ విధానంపై చర్చ జరిగినట్టు సమాచారం.
జమ్ముకశ్మీర్ ఎయిర్ బేస్ వద్ద డ్రోన్లతో దాడి జరగడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు సమావేశమై.. నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. వరసగా డ్రోన్లను ప్రయోగిస్తున్నాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమై చర్చించారు.

జమ్ము మిలిటరీ స్టేషన్ వద్ద సోమవారం కూడా డ్రోన్లు కలకలం రేపాయి. దీంతో దాడి చేసే అవకాశం ఉందని ఆర్మీ హెచ్చరించింది. తమ సిబ్బంది కాల్పులు జరపడంతో.. డ్రోన్లను వెనక్కి వెళ్లిపోయానని చెప్పారు. ఆదివారం జమ్ము ఎయిర్ బేస్‌పై జరిగిన దాడికి లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆ గ్రూపే డ్రోన్లను ప్రయోగించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్రోన్ పాలసీ తీసుకొస్తున్నామని సంకేతాలను ఇచ్చారు.