యజమాని కాదు రాక్షసుడు: తాగాడు, సిబ్బందిని కొట్టాడు.. (వీడియో)
చెన్నై : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ సమాన అవకాశాలు. హక్కులను రాజ్యాంగం కల్పించింది. కానీ ఇదే కొందరిపాలిట శాపమవుతుంది. ఓ విదేశీయునికి దేశంలో వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. కానీ అతను తన ఉద్యోగుల పాలిట యముడిలా మారాడు. ఏ చిన్న తప్పు చేసినా .. తప్పేం చేయకున్నా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అసభ్య పదజాలంతో దూషించడం .. లేదంటే చేయిచేసుకోవడమే పనిగా మారింది. ఇలా ఇన్నాళ్లు బాధపడ్డ ఉద్యోగులు చివరికీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

యజమాని కాదు రాక్షసుడు
కొరియాకు చెందికు వాన్‌జీ మూన్ అనే వ్యాపారి .. ఇతనికీ చెన్నైలో ఓ అతిథి గృహం ఉంది. అందులో నాగాలాండ్‌కి చెందిన ఉద్యోగులు ఉన్నారు. కానీ వారి పట్ల వాన్ జీ రాక్షసుడిలా మారాడు. వారిని ప్రతీసారి ఏదో కారణం చెప్పి తిడుతూనే ఉంటారు. ఇటీవల తాగొచ్చి గెస్ట్ హౌజ్‌కు వచ్చాడు. సిబ్బందిని తిట్టడంతోపాటు చేయిచేసుకున్నాడు. వాన్ జీ వద్ద పనిచేసే నాగాలాండ్ యువకులు .. అతని మూర్ఖపు ప్రవర్తనను ప్రపంచానికి తెలియజేయాలని భావించారు. ఈ నెల 5న చెన్నైలోని గెస్ట్ హౌస్‌లో ఏదో ఒక అంశంపై సిబ్బందిని దూషిస్తున్న ఘటనను రికార్డు చేశారు. ఎప్పుడు చదువుతారు ? నేర్చకుంటారు అని కొరియా స్లాంగ్‌లో మాట్లాడుతూ నాగాలాండ్ యువకుడి చెంప చెళ్లుమనిపించాడు. తర్వాత ఏదో ఒకటి అడుగుతూ మళ్లీ రెండుసార్లు కొట్టాడు. అక్కడున్న యువకులు భయపడుతూనే చెప్పిన పనిని చేస్తున్నారు. మరో యువకుడు అయితే వాన్ జీ .. కాలుకు ఏదో తగలిందని దానిని కూడా తీసే ప్రయత్నం చేశాడు.

రెచ్చిపోయిన వాన్ జీ మూన్
యువకులు అంతా భయపడుతుంటే వాన్ జీ మూన్ మరింత రెచ్చిపోయాడు. చదవలేరా ? అర్థం చేసుకోలేరా ? వినలేరా అంటూ చెంపపై కొట్టాడు. ఈ వీడియో జిలియాన్‌గ్రాంగ్ స్టూడెంట్ యూనివన్ వద్దకు రావడంతో .. వివిధ గ్రూపుల్లో షేర్ చేశాడు. వాన్ జీ చర్యను విద్యార్థి సంఘం నేత పౌజట్‌లంగ్ తప్పుపట్టారు. పనిచేసే యువకులను కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆ వీడియోనే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చయేడంతో వెయ్యి కామెంట్లు వచ్చాయి. విషయం తెలుసుకున్న చెన్నైలోని నార్త్ ఈస్ట్ ఇండియా వెల్పేర్ అసోసియేషన్ .. వాన్ జీ కబంధ హస్తాల నుంచి ఆ యువకులకు విముక్తి కలిగించారు. ఉద్యోగులపై చేయిచేసుకున్న వాన్ జీ పై ఐపీసీ 294(బీ), 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సరికాదు ..
వాన్ జీ చర్యను ప్రజాసంఘాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగులపై చేయిచేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇది సరికాదని .. ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలే తప్ప .. అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని హితవు పలికింది. ఒకడుగు ముందుకేసి చేయిచేసుకోవడం ఏంటని మండిపడ్డాయి. నాగాలాండ్ యువతపై చేయిచేసుకున్నందుకు కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications