రాహుల్ గాంధీకి ఫేస్ బుక్ షాక్-ఆ వివాదాస్పద ఫొటో తొలగింపు- తమ పాలసీకి విరుద్ధమంటూ
ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి, హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆ పోస్టును ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ పెట్టిన వివాదాస్పద పోస్టుపై విమర్శలు రావడంతో దీన్ని తొలగిస్తున్నట్లు ఫేస్ బుక్ ఇవాళ తెలిపింది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీకి కూడా తెలియజేసింది.
తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వివాదాస్పద పోస్టును తొలగిస్తున్నట్లు రాహుల్ గాంధీకి ఫేస్ బుక్ సమాచారం ఇచ్చింది ఇప్పటికే ఈ పోస్టును తొలగించాలని రాహుల్ గాంధీని ఫేస్ బుక్ కోరింది అయితే ఆయన దీన్ని తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ఫేస్ బుక్ తానే ఈ పోస్టును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఉన్న ఈ పోస్టు తమ నిబంధనలకు ఎలా విరుద్ధంగా ఉందో వివరిస్తూ ఆయనకు మెయిల్ పంపింది.

ఇన్ స్టా గ్రామ్ లో రాహుల్ గాఁధీ పెట్టిన పోస్టుపై జాతీయ బాలల హక్కుల కమిషన్ నుంచి ఆయనతో పాటు ఫేస్ బుక్ కూ సమన్లు అందాయి. దీంతో ఫేస్ బుక్ చర్యలకు దిగింది. వాస్తవానికి ట్వి్ట్టర్ లోనూ రాహుల్ గాంధీ ఇదే పోస్టు పెట్టగా దాన్ని కూడా సోషల్ మీడియా దిగ్గజం తొలగించింది. ఇప్పుడు ఫేస్ బుక్ కూడా ఇన్ స్టా గ్రామ్ లో రాహుల్ పోస్టు తొలగించడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజాల్ని కేంద్రం నియంత్రిస్తోందంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ట్విట్టర్ నిర్ణయంపై విమర్శలు చేసిన రాహుల్.. ఇప్పుడు ఫేస్ బుక్ నిర్ణయంపై ఇప్పటిదాకా స్పందించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కూడా నిలిపేయడం చర్చనీయాంశమైంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications