వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ గూటికి కన్హయ్య.. సపోర్ట్ చేస్తానంటోన్న జిగ్నేశ్ మేవాని.. రాహుల్ సమక్షంలో

|
Google Oneindia TeluguNews

జేఎన్యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గుజరాత్‌కు చెందిన దళిత నేత జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. ఢిల్లీలో గల ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగ ధరించి రాహుల్‌ గాంధీని కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ ‌రహే అంటూ నినాదాలు చేశారు.

కన్హయ్యకు ఆహ్వానం..

కన్హయ్యకు ఆహ్వానం..

అంతకుముందు కన్హయ్య కుమార్‌కు పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పోస్టర్లు వెలిశాయి. కన్హయ్య కుమార్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా బీహార్‌లోని తన హోమ్‌టౌన్ బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. జిగ్నేష్ మేవాని గుజరాత్ వడ్గాం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరు యువ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆ పార్టీకి బూస్టింగే.. ఇద్దరు పార్టీలో చేరడాన్ని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ స్వాగతించారు.

ఒకరోజు వెనక్కి..

ఒకరోజు వెనక్కి..

ఈ నెల 27వ తేదీన పార్టీ చేరాలని అనుకున్నారు. ఆ రోజు సహీద్ భగత్ సింగ్ జయంతి.. ఆ రోజున రైతు నేతలు ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఆందోళనలతో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దీంతో కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని పార్టీలో చేరిక ఇవాళ్టికి వాయిదా పడింది.

Recommended Video

'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
బూస్టింగే

బూస్టింగే

కన్హయ్య కుమార్.. జేఎన్‌యూలో ఫేమ్ అయ్యారు. సీపీఐ పార్టీలో ఇప్పుడు ఉన్న.. అంతకుముందు ఆ పార్టీకి చెందిన విద్యార్థి విభాగంలో పనిచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. వార్తల్లోకి వచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెగసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ విజయం సాధించారు. బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కన్హయ్య కుమార్ పార్టీ మారారు. జిగ్నేశ్ మేవాని దళిత నేత.. గుజరాత్‌లోని వాడగామ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గుజ‌రాత్ రాజ‌కీయాల్లో జిగ్నేష్ మేవాని సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌ధాని రాష్ట్రంలో బీజేపీ హ‌వా ఉన్న స‌మ‌యంలో జిగ్నేష్ గెలిచి అంద‌రి దృష్టిని త‌నవైపు తిప్పుకున్నారు. జిగ్నేష్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా భ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ స‌పోర్ట్‌తో గెలిచారు. ఇక సీపీఐ నుంచి గెలిచిన క‌న్హ‌య్య కుమార్ కాంగ్రెస్ ఆహ్వానంతో పార్టీలో చేరారు.

English summary
Former CPI leader Kanhaiya Kumar joined the Congress in the presence of Rahul Gandhi in New Delhi. Vadgam MLA Jignesh Mevani also pledged support to the Congress ideology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X