నలుగురు జడ్జీల తిరుగుబాటు: మాజీ జడ్జీల బహిరంగ లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు నలుగురు మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాసినవారిలో ఒకరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాగా, మరో ముగ్గురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు. కేసుల కేటాయింపుల హేతుబద్దంగా, నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాలని వారుర ప్రధాన న్యాయమూర్తిని కోరారు.

Judges

ముఖ్యమైన, సున్నితమైన కేసుల విషయంలో అధికార దుర్వినియోగం జరగడం లేదని ప్రజలకు నమ్మకం కలిగించాలని వారన్నారు. కేసుల కేటాయింపులు జూనియర్ న్యాయమూర్తులు గల కొన్ని బెంచీలకు మాత్రమే జరగకూడదని, కేసుల కేటాయింపులో అటువంటి వివక్ష ఉండకూడదని వారన్నారు.

రిటైర్డ్ న్యాయమూర్తులు పిబి సావంత్, ఎపి షా, కె చంద్రు, హెచ్ సురేష్ ఆ బహిరంగ లేఖ రాశారు. తమ బహిరంగ లేఖను వారు మీడియాకు అందించారు. మాజీ న్యాయమూర్తులతో కలిసి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు జస్టిస్ షా ధ్రువీకరించారు.

లేఖలో తాను చెప్పిన అంశాలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభిప్రాయాలకు అనుగుణంగానే ఉన్నాయని ఆయన అన్నారు సమస్య పరిష్కారం కావాలని, బెంచీల కేటాయింపు, కేసుల పంపిణీకి నిర్దిష్టమైన నిబంధనలను రూపొందించాలని నలుగురు మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four retired judges, one from the Supreme Court and three from the High Court have written an open letter to the Chief Justice of India, asking him that all sensitive and important cases including pending ones, be dealt with by a Constitution Bench of the 5 senior most Judges of the Court.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి