హెచ్1బీ వీసా ఫీజు పెంపు విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం!

h1b వీసా ఫీజును ఒక లక్ష డాలర్లకు పెంచుతూ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది.

h1b వీసా ఫీజు విషయంలో వెనక్కు తగ్గేది లేదు.. పోరాటం చేస్తాం..
హెచ్ వన్ బి వీసా విధానం పైన వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లివిట్ స్పందించారు. h1b వీసావ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని, వీసావ్యవస్థ దుర్వినియోగం అవుతుందని దీనివల్ల అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై తాము కోర్టులో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలను కల్పించడం, వీసా వ్యవస్థను బలోపేతం చేయడం తమ అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ప్రాధాన్యత అని లివిట్ పేర్కొన్నారు.

Fraud in the H1B visa system that s why the fee of one hundred thousand dollars Trump s white house calrity

Take a Poll

హెచ్ వన్ బి వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని వెల్లడి
ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేదే లేదని, h1b వీసా ఫీజు లక్షల డాలర్లకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టులో పోరాడుతామన్నారు. చాలాకాలంగా హెచ్ వన్ బి వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని అందుకే ఈ కొత్త విధానాలను అమలు చేస్తున్నామని లివిట్ పేర్కొన్నారు. ఇవి చట్టబద్ధమైనవని ఆమె వెల్లడించారు.

హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ కోర్టులో పిటీషన్లు
ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్ వన్ బి వీసా వ్యవస్థ వ్యవస్థలో లక్ష డాలర్ల చెల్లింపు నిర్ణయం దారుణమని ఇది వీసా వ్యవస్థను దెబ్బతీస్తుందని కోర్టును ఆశ్రయించారు. ఈ ఫీజు చిన్న, మధ్య తరహా కంపెనీలకు పెనుభారంగా మారుతుందని ఈ హెచ్ వన్ బి ప్రోగ్రాం ఉద్దేశమే అమెరికన్ వ్యాపారాలకు ప్రపంచ ప్రతిభను ఆకర్షించటం అని పేర్కొన్నారు.

యూఎస్ ఫస్ట్ నినాదంతోనే ముందుకెళ్తామన్న వైట్ హౌస్
తాజాగా ట్రంప్ విధించిన కొత్త ఫీజుతో ఆ లక్ష్యం దెబ్బతింటుందని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తాము దాఖలు చేసిన పిటిషన్లో వెల్లడించింది. ఇక అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే కాకుండా కాలిఫోర్నియా, వాషింగ్టన్ డిసిలోని పలు యూనియన్లు, సంస్థలు, సంఘాలు కూడా ఈ పెంపు చట్ట విరుద్ధమని పిటిషన్లు దాఖలు చేశాయి. ఇక ఈ పిటిషన్లపై పోరాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఫస్ట్ అన్న నినాదంతో తాము ముందుకు వెళతామని లివిట్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+