Actor Vijay: హీరో విజయ్ కు సీబీఐ మరో షాక్..! తాజా సమన్లు..!
తమిళ హీరోకు మరో షాక్ తగిలింది. గతేడాది జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుపుతున్న సీబీఐ తాజాగా విజయ్ ను విచారించింది. నిన్న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు సాగిన విచారణ అనంతరం స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన విజయ్ కు ఇవాళ సీబీఐ మరో షాకిచ్చింది. మళ్లీ విచారణకు రావాలని సమన్లు పంపింది. దీంతో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ కు ఈ కష్టాలు మరికొంతకాలం తప్పేలా లేవు.
గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ లో విజయ్ పార్టీ టీవీకే ఏర్పాటు చేసిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హీరో విజయ్ ఇరుకునపడ్డారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు దాఖలు కావడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేయడంతో విజయ్ కష్టాలు రెట్టింపయ్యాయి.

అనంతరం టీవీకే ర్యాలీ, కరూర్ తొక్కిసలాట ఘటనలపై ఆధారాలు సేకరించిన సీబీఐ.. వరుసగా వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి విజయ్ ను రప్పించి దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించింది. ఇందులో కరూర్ తొక్కిసలాట వెనుక అసలు కారణాలు ఏంటి, ప్రభుత్వం తగిన భద్రత కల్పించిందా లేదా, ముందస్తు ఏర్పాట్లు చేసిందా లేదా అనే అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో మరోసారి 19న విచారణకు రావాలని ఇవాళ హీరో విజయ్ కు సమన్లు పంపింది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications