పెట్రో ధరల పెంపుపై తేల్చేసిన కేంద్రం..! 25 రోజులకే చమురు నిల్వలు..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)మూకుమ్మడిగా ప్రారంభించిన యుద్ధం ఇవాళ నాలుగో రోజు కొనసాగుతోంది. మరో నాలుగైదు వారాలు యుద్దం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పేస్తున్నారు. అటు ఇరాన్ తమ పొరుగునే ఉన్న హార్ముజ్ జల సంధి గుండా వెళ్లే చమురు నౌకలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జల సంధి దగ్గరే వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ వైపు నుంచి సగం చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ అలర్ట్ అయింది.

దేశంలో ప్రస్తుతం ఉన్న చమురు నిల్వలపై కేంద్రం అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుంటోంది. తాజా వివరాల ప్రకారం మన దేశంలో మరో 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ దొరకవన్న భయాలు మొదలైతే మాత్రం ఈ నిల్వలు అంతకన్నా ముందే ఖాళీ అయిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఇప్పటికే పెట్రోల్ బంకులకు జనం క్యూ కడుతున్నారు. దీంతో కేంద్రం పెట్రో ధరల పెంపు (fuel price hike), తాజా పరిస్ధితిపై క్లారిటీ ఇచ్చింది.

Fuel Price Hike Clarification Centre Responds to Worries Over India s 25-Day Oil Reserve

భారతదేశంలో ప్రస్తుతం ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధన నిల్వలు దాదాపు 25 రోజుల పాటు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవాళ తెలిపాయి. అదే సమయంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ముడి చమురు, ఎల్పీజీ , ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడానికి ప్రత్యామ్నాయ దేశాల కోసం అధికారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే తక్షణ ప్రణాళిక మాత్రం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇవాళ వరుసగా మూడో సెషన్‌లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు ఉత్పత్తి ప్రాంతాలలో ఒకటైన మధ్యప్రాచ్యం నుండి సరఫరాలకు అంతరాయం కలగవచ్చన్న వ్యాపారుల ఆందోళనే ఇందుకు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+