వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌరీ లంకేష్ హత్య: కిల్లర్ ఇతనేనా, ఎవరీ నవీన్ కుమార్?

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసు మిస్టరీని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఛేదించినట్లేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. నిరుడు సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన గౌరీ లంకేష్ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

గౌరీ లంకేష్‌ హత్యలో పాలు పంచుకున్నట్లు అనుమానిస్తూ సిట్ రాడికల్ హిందుత్వ గ్రూప్‌నకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతన్ని కెటి నవీన్ కుమార్ (37)గా గుర్తించారు. అతను మద్దూరుకు చెందినవాడు.

అతను హిందూ యువసేన వ్యవస్థాపకుడు

అతను హిందూ యువసేన వ్యవస్థాపకుడు

రైట్ వింగ్ రాడికల్ సంస్థ హిందూ యువసేన అనే సంస్థను స్థాపించాడు. దానికి సనాతన సంస్థతో సంబంధాలున్నాయి. హిందూ జనజాగృతి సంస్థకు అనుబంధంగా పనిచేస్తోంది. నవీన్‌ు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫిబ్రవరి 18వ తేదీన అరెస్టు చేశారు.

నవీన్ వీటితో దొరికాడు....

నవీన్ వీటితో దొరికాడు....

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు నవీన్ కెంపెగౌడ బస్సు స్టేషన్‌లో పాయింట్ 32 కాలిబర్‌కు చెందిన 15 రౌండ్ల కాట్రిడ్జెస్‌తో పట్టుబడ్డాడు. వాటిని కస్టమర్లకు అమ్మడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతనికి హిందూ్వ సంస్థలతో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. అదే విధంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి డీల్స్ కూడా చేస్తున్నట్లు తెలిసింది.

 బలంగా నమ్ముతున్న సిట్...

బలంగా నమ్ముతున్న సిట్...

గౌరీ లంకేష్ హత్యతో నవీన్ కుమార్‌కు సంబంధం ఉందని సిట్ బలంగా నమ్ముతోంది. గౌరీ లంకేష్‌ను హత్య చేయడానికి బైక్‌తో రెక్కీ నిర్వహించిన వ్యక్తి నవీన్ కుమార్ లాగే ఉన్నాడని, అయితే అతను అవునా, కాదా ధృవీకరించుకోవాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.

 నవీన్‌కు వ్యవస్థీకృత ముఠా

నవీన్‌కు వ్యవస్థీకృత ముఠా

రైట్ వింగ్ గ్రూప్‌నకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేసే వ్యవస్థీకృత ముఠాతో నవీన్‌కు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ఆయుధాలు సేకరణ, వాటి క్లయింట్ల గురించి తెలుసుకోవడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోంది.

గౌరీ లంకేష్ హత్య దీనివల్ల

గౌరీ లంకేష్ హత్య దీనివల్ల

హిందూత్వను తీవ్రంగా వ్యతిరేకించే జర్నలిస్టుగా గౌరీ లంకేష్‌కు పేరుంది. ఆమెను ఇద్దరు వ్యక్తలు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఇది ఆమె ఇంటి వద్దనే జరిగింది. ఈ కేసు విచారణకు హోం మంత్రి రామలింగా రెడ్డి సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆ సిట్ గౌరీ లంకేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తోంది.

English summary
The suspect in Gauri lankesh murder case, identified as KT Naveen Kumar (37), a native of Maddur, is a founder of right-wing radical outfit Hindu Yuva Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X