పసిడి ప్రియులకు మళ్ళీ బంగారం ధరల షాక్; పెరిగిన ధరలు; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!

ఒకవైపు అక్షయతృతీయ సమీపిస్తున్నా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్నటి వరకు కొద్దిగా తగ్గిన బంగారం ధరలు, నేడు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 62వేల చేరువకు బంగారం ధరలు చేరుకోగా, భవిష్యత్తులో బంగారం ధరలు 70వేల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

బంగారం లేటెస్ట్ రేట్లు ఇవే.. ఈ అక్షయ తృతీయకు బంగారం ధరలు మరింత ప్రియం!!

ఇక నేడు దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే భారతదేశంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర నేడు రెండు వందల రూపాయలు పెరిగి 56,050 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 230 రూపాయల మేర పెరిగి 61,150 రూపాయల వద్ద ప్రస్తుతం విక్రయించబడుతుంది.

Gold prices

హైదరాబాద్ లో నేడు 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,050 రూపాయలు కాగా, 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,150 రూపాయల వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 310 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,050 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,150 రూపాయలుగా ట్రేడవుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 200 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.

Gold prices

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కడప, ప్రకాశం, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,050 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 150 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.

దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూరు, సేలం, తిరుపూరు, తిరుచ్చి, తిరునవ్వేలి, ఈ రోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 650 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,800 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+