వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి షాక్: గుజరాత్‌లో బీజేపీకి భారీగా తగ్గిన ఓట్లు, కాంగ్రెస్ వైపు మళ్లిన ఓటర్లు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో ఆ పార్టీ ఢిల్లీ కార్యాలయం, ఆయా రాష్ట్రాల కార్యాలయాల వద్ద నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Recommended Video

మోడీకి షాక్ మీద షాక్, సొంతూరు లో బీజేపీ ఓటమి : సోనియాతో రాహుల్ భేటీ

చదవండి: గుజరాత్ ఎన్నికల ఫలితాలు 2017 కోసంచదవండి: గుజరాత్ ఎన్నికల ఫలితాలు 2017 కోసం

గుజరాత్ ఫలితాలు అంతటా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోను దీనిపై ఆసక్తి కనిపిస్తోంది. ఈ ఎన్నికలు ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగులో ఉన్నాయి. గుజరాత్ తీర్పు, గుజరాత్ ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికలు 2017 లాంటి హ్యాష్ ట్యాగ్‌లు టాప్ ట్రెండింగులో ఉన్నాయి.

 గతంలో కంటే తక్కువ సీట్లకు బీజేపీ

గతంలో కంటే తక్కువ సీట్లకు బీజేపీ

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ గతంలో కంటే సీట్లు తక్కువగా సాధించింది. కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకూర్ వంటి కుల సంఘ యువ నాయకులు మద్దతు పలకడం, బీజేపీ ఓట్లను చీల్చేందుకు కొన్ని పార్టీలు పోటీ చేయడం వంటివి జరిగాయి. దీంతో బీజేపీ గతంలో కంటే తక్కువ సీట్లు గెలుచుకుంది.

 కాంగ్రెస్‌కు గతంలో కంటే ఎక్కువ సీట్లు

కాంగ్రెస్‌కు గతంలో కంటే ఎక్కువ సీట్లు

2007లో కాంగ్రెస్ 59, 2012లో 27 సీట్లు గెలుచుకుంది. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ 70కి పైగా సీట్లు గెలుచుకుంది. ఓ దశలో బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది. అయితే ఎగ్జిట్ ఫలితాలకు దాదాపుగా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. అయితే బీజేపీకి ఓట్ల శాతం మాత్రం తగ్గింది.

 బీజేపీకి, కాంగ్రెస్ పార్టీల ఓట్ల శాతం

బీజేపీకి, కాంగ్రెస్ పార్టీల ఓట్ల శాతం

గుజరాత్‌లో బీజేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 1,47,24,427 ఓట్లు వచ్చాయి. 49.1 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 1,24,38,937 ఓట్లు సాధించింది. 41.4 శాతం ఓట్లు వచ్చాయి. నోటాకు5,51,615 ఓట్లు వచ్చాయి. 1.8 శాతం వచ్చింది.

2012లో ఓట్ల శాతం

2012లో ఓట్ల శాతం

2012లో బీజేపీకి 47.9 శాతం ఓట్లు రాగా, 119 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 31.3 శాతం ఓట్లు రాగా 57 సీట్లు వచ్చాయి. ఈసారీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం భారీగా పెరిగింది. బీజేపీకి ఓట్ల శాతం మాత్రం కొద్దిగా పెరిగింది.

English summary
The difference between both the parties is 7,77,208.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X