వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ పోల్: అగ్రవర్ణాలకు టికెట్లు డబుల్, ఠాకూర్లు, జైన్లకు తగ్గిన బీజేపీ సీట్లు

|
Google Oneindia TeluguNews

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా ఉంది. అభ్యర్థులను ప్రకటించడమే కాదు.. ప్రచారం కూడా చేస్తోంది. ఇప్పటికే 160 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్ నార్త్, సెంట్రల్‌లో 22 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే 160 మందిలో అగ్రవర్ణాలకే బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది.

39 మంది పాటిదార్లకు టికెట్

39 మంది పాటిదార్లకు టికెట్

2017లో పాటిదార్లకు 50 సీట్లు కేటాయించగా.. ఈ సారి 39 మంది అభ్యర్థులను ప్రకటించారు. 2017లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎక్తా మంచ్ లీడర్లుతో ఎన్నికకు వెళ్లింది. పాటిదార్ నేత హర్థిక్ పటేల్, దళిత నేత జిగ్నేష్ మేవాని, ఎక్తా మంచ్ నేత అల్పేశ్ ఠాకూర్‌ ఉండగా.. బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది. పాటిదార్ ఆందోళన చేయడంతో బీజేపీ జాబితాలో మార్పులు మాత్రం చేయలేదు.

2012లో వారికి 52 సీట్లను కేటాయించగా.. 2017లో 50కి పరిమితం చేసింది . ఇందులో 3 సీట్లను కడ్వా పాటిదార్స్‌కు కేటాయించింది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం పాటిదార్లు ఉద్యమం చేయగా.. బలపడిన రెండో సామాజిక వర్గం ఠాకూర్లు అనే సంగతి తెలిసిందే.

ఠాకూర్లకు తగ్గిన సీట్లు

ఠాకూర్లకు తగ్గిన సీట్లు

2012లో బీజేపీ 8 మంది ఠాకూర్లకు సీటు కేటాయించింది. అదీ 2017లో 15కి పెంచింది. ఈ సారి మాత్రం 9 మందికే ఇచ్చింది. అయితే బ్రహ్మణులకు మాత్రం డబుల్ చేసింది. 2017లో బ్రహ్మణులకు 8 సీట్లు ఇవ్వగా.. ఈ సారి 13 మందికి కేటాయించింది. 2012లో కూడా 10 మందికి ఇచ్చింది. 2017లో తగ్గించి.. ఈ సారి పెంచింది.

జైన్లకు తగ్గిన సీట్లు.. బ్రహ్మణులు అధికం

జైన్లకు తగ్గిన సీట్లు.. బ్రహ్మణులు అధికం

2012లో జైన్ కమ్యూనిటీకి 15 సీట్లు ఇవ్వగా.. 2017, 2022లో అదీ కేవలం 4 సీట్లకే పరిమితం చేసింది. 2017లో అహ్మదాబాద్ నగరంలో ఒకరికీ టికెట్ ఇవ్వగా.. ఈ సారి ముగ్గురికి టికెట్ కేటాయించింది. కులం, ప్రతిపక్ష అభ్యర్థుల ఆధారంగా టికెట్లను కేటాయించామని బీజేపీ నేత ఒకరు తెలిపారు. స్థానికులతో అభ్యర్థి సాన్నిహిత్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. అన్నీ కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఓబీసీ కేటగిరీ కింద 146 కులాలు ఉన్నాయని.. దల్వాడీ, పంచా, ప్రజాపతిలకు 2017 నుంచి టికెట్లు ఇస్తున్నామని వివరించారు. గత మూడు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని మార్చలేదని వివరించారు. 2012, 2017లో 27 మంది ఎస్టీలకు టికెట్ ఇచ్చి బరిలో నిలిపామని తెలిపారు. ఈసారి 23 మందికి టికెట్ కేటాయించింది.

రెండు విడతలుగా

రెండు విడతలుగా

గుజరాత్ అసెంబ్లీ నియోజకవర్గంలో 182 స్థానాలు ఉన్నాయి. రెండు విడతలుగా ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 1వ తేదీన 89 నియోజకవర్గాలకు 5 వ తేదీన 93 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. డిసెబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికలో ఆరో సారి గెలిచి.. అధికారం చేపడుతామని బీజేపీ ధీమాతో ఉంది. గుజరాత్ పోల్‌పై ఆప్ కూడా ఆశలు పెట్టుకుంది. అధికారం చేపడుతామని ధీమాతో ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము రేసులో ఉన్నామని చెబుతోంది. ఆ మేరకు ప్రచారం నిర్వహిస్తోంది.

English summary
bjp declared 160 candidates in first list, these list brahmin community get double seats. thakor, jains ticket are less.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X