విజయ్ రుపాణి కుర్చీకి ఆర్ఎస్ఎస్ ఎర్త్: ఆ సర్వే రిపోర్ట్‌ తరువాతే రిజైన్: ఆమ్ ఆద్మీ స్ట్రాంగ్

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం. ఉత్తరాఖండ్, అస్సాం, కర్ణాటక తరహాలో ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపింది. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తోన్నాయంటూ అందిన నివేదిక ఆధారంగా మోడీ- అమిత్ షా జోడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రుపాణీతో రాజీనామా చేయించింది.

కేంద్రమంత్రుల పర్యవేక్షణలో..

కేంద్రమంత్రుల పర్యవేక్షణలో..

ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ అధిష్ఠానం దూతలుగా ఇద్దరు కేంద్ర మంత్రులు గుజరాత్‌కు వెళ్లనున్నారు. బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, వ్యవసాయం- రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ సభాపక్ష సమావేశానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే కొన్ని ఫ్రంట్ రన్నర్ల పేర్లు విస్తృతంగా వినిపిస్తోన్నాయి.

కేంద్రమంత్రి మాండవీయ సహా..

కేంద్రమంత్రి మాండవీయ సహా..

గుజరాత్ ముఖ్యమంత్రి పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా చాలా పేర్లే వినిపిస్తోన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, దాద్రా నగర్ హవేలి-లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గుజరాత్ పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ ఖోడాభాయ్ రుపాల, వ్యవసాయం-రవాణా శాఖ మంత్రి రణ్‌ఛోద్ భాయ్ ఛనాభాయ్ ఫాల్దు, మాజీ హోం శాఖ మంత్రి గోర్డాన్ జడాఫియా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.

ఈ పరిణామాలన్నింటికీ మూల కారణం..

ఈ పరిణామాలన్నింటికీ మూల కారణం..

గుజరాత్‌లో ఒక్కసారిగా ఈ తరహా రాజకీయ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. విజయ్ రుపాణి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సర్వే.. ఆయన కుర్చీకి ఎసరు పెట్టిందని తెలుస్తోంది. విజయ్ రుపాణిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం వల్ల ఎంతమాత్రం కూడా ఉపయోగం ఉండబోదని ఆర్ఎస్ఎస్ తేల్చి చెప్పింది. ఆయనను మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి.. ఎన్నికలకు వెళ్లడం వల్ల పరాజయం తప్పకపోవచ్చంటూ సంఘ్ తన నివేదికలో స్పష్టం చేసిందని, రుపాణిని తప్పించాలని సిఫారసు చేసినట్లు చెబుతున్నారు.

 ఆమ్ ఆద్మీ పార్టీ కీలకంగా..

ఆమ్ ఆద్మీ పార్టీ కీలకంగా..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించిందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ముగిసిన తరువాత.. ఆ పార్టీ జన సంవేదన యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు అనూహ్యంగా విజయవంతం అయ్యాయని, ఈ యాత్ర ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని, ప్రజలను చైతన్యపరిచిందని సంఘ్.. తన నివేదికలో కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఈ నివేదిక తరువాతే- విజయ్ రుపాణిని తప్పించాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలుస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేకత తోడు..

ప్రభుత్వ వ్యతిరేకత తోడు..

ప్రభుత్వ వైఫల్యాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడానికి తోడుగా.. 27 సంవత్సరాల పాటు ఒకేపార్టీ అధికారంలో ఉండటం కూడా బీజేపీ మీద వ్యతిరేకత పెరగడానికి, మొఖం మొత్తడానికి ఓ కారణమైనట్లు ఆర్ఎస్ఎస్ తన సర్వే నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వ్యతిరేకతను తగ్గించడానికి ముఖ్యమంత్రిగా పటిదార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ.. రుపాణిని తప్పించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+