వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరెస్సెస్ వ్యూహాత్మక ప్రచారం: బీజేపీకి నేరుగా మద్దతిచ్చేందుకువెనుకంజ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్/ గాంధీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రు సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్). బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వానికి కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికి సంఘ్ పరివార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జీఎస్టీ, నోట్ల రద్దు తదనంతర పరిణామాల్లో ఆరెస్సెస్ నేరుగా బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధంగా లేదు.
కేంద్రం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలపై సూరత్‌లో చిన్న వజ్రాభరణాలు, టెక్స్‌టైల్ వ్యాపారులు అసంత్రుప్తితో ఉన్నారు.

వ్యాపారులు, ఓటర్ల సమస్యలు వినేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని విన్నవిస్తూ సంఘ్ కార్యకర్తలు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జీఎస్టీ విధానంలో పలు మార్పులు తీసుకొస్తున్నదని గుర్తు చేస్తోంది.

 చిన్న, మధ్య తరగతి వర్గాల పారిశ్రామికవేత్తలపై మోహన్ భగవత్ ఇలా

చిన్న, మధ్య తరగతి వర్గాల పారిశ్రామికవేత్తలపై మోహన్ భగవత్ ఇలా

తొలుత జీఎస్టీలో అత్యధికంగా 28 శాతం శ్లాబ్ విధించిన ప్రభుత్వం.. తర్వాత వ్యాపారుల ఆందోళన గమనించాక 177 వస్తువులపై పన్నుశాతం 18 శాతానికి తగ్గించిన సంగతి నర్మగర్భంగా ప్రస్తావిస్తున్నారు సంఘ్ కార్యకర్తలు. ఇటీవల విజయ దశమి సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల ఆందోళనలు, సమస్యలను పట్టించుకోవాలని సూచించారని సంఘ్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. దళితులు, పాటిదార్లకు బీజేపీ పట్ల వ్యతిరేకత గుర్తిస్తే.. దాని ప్రభావం ఎన్నికల్లో చూపకుండా చర్యలు చేపడుతున్నది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం పాటిదార్లు, హక్కుల పరిరక్షణ కోసం దళితులు సంఘటితం అయ్యారు.

 దళితులు, పాటిదార్లపైనే సంఘ్ ప్రధాన ఫోకస్

దళితులు, పాటిదార్లపైనే సంఘ్ ప్రధాన ఫోకస్

హిందువుల ఓట్ల చీలిక నివారణకు అవసరమైన చర్యలన్నీ సంఘ్ చేపడుతున్నది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టిన సంఘ్.. ప్రజల్లో నెలకొన్న నిరసన ధ్వనిని తెలుసుకునేందుకు తన శ్రేణులను బరిలోకి దించింది. దళితులు, పాటిదార్లతో ఆరెస్సెస్ నాయకత్వం నిత్యం సమావేశాలు జరుపుతూ బీజేపీ తన హామీలను అమలు చేయడంతో వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని హామీలిస్తున్నది.
దళితులు, గిరిజనుల సమస్యల పట్ల బీజేపీ, ఆరెస్సెస్ వైఖరి ఎల్లవేళలా అనుమానాస్పదమే.

 సోషల్ మీడియాలో 20 % పోస్టుల పెరుగుదల

సోషల్ మీడియాలో 20 % పోస్టుల పెరుగుదల

ఆదివాసీ కిసాన్ సంఘర్ష్ మోర్చా ప్రతినిధి రోమెల్ సుతారియా 15 శాతం మంది గిరిజనుల మనస్సు చూరగొనేందుకు సాంస్క్రుతిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ‘రామ్ కథ'పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరెస్సెస్ వెస్ట్ జోన్ కార్యదర్శి సునీల్ మెహతా స్పందిస్తూ దళితులతోపాటు ఓటర్లతో ‘సంపర్క్' భేటీలు నిర్వహిస్తూ ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. హిందువుల ఉమ్మడి ఓటింగ్ సంఘటిత పరిచేందుకు ఆరెస్సెస్ క్రుషి చేస్తున్నది. కులాల ప్రాతిపదికన చీలిక ఆందోళన కలిగిస్తున్నది.గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గెలుపొందేందుకు రెట్టింపు క్రుషి చేస్తున్నది. సోషల్ మీడియా ద్వారా యువతలో వ్యక్తిగత సంబంధాలు మెరుగుదలకు ప్రయత్నిస్తున్నామని ఆరెస్సెస్ నేత మెహతా వ్యాఖ్యానిస్తున్నారు. గతంతో పోలిస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో 20 శాతం పోస్టింగ్‌లు పెరుగడం ఆసక్తికర పరిణామం.

 ఇలా సంఘ్ అనుబంధ సంస్థలు

ఇలా సంఘ్ అనుబంధ సంస్థలు

తొలిదశ పోలింగ్ నాటికి ఇంకా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాల్సి ఉన్నదని ఆరెస్సెస్ నేత మెహతా అంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఏటేటా ఆరెస్సెస్ శాఖలు 10 నుంచి 15 శాతం పెరుగుతున్నాయి. వారానికి ఒకసారి 700 నుంచి వెయ్యి చోట్ల శాఖా సమావేశాలు జరుగుతున్నాయి. ఏబీవీపీ, వనవాసి కల్యాణ్ ఆశ్రమం, ఆరోగ్య భారతి, విద్యా భారతి తదితర ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు చురుగ్గా స్పందిస్తున్నాయి. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ముస్లిం రాష్ట్రీయ మంచ్‌కు మాత్రం గుజరాత్‌లో ఉనికి లేదని చెప్తున్నారు.

విజయ్ రూపానీకి దన్నుగా కేంద్ర మంత్రి జైట్లీ ఇలా

విజయ్ రూపానీకి దన్నుగా కేంద్ర మంత్రి జైట్లీ ఇలా

అంతేకాదు యావత్ బీజేపీ ప్రధాన నాయకత్వం ప్లస్ కేంద్ర క్యాబినెట్ మంత్రులు.. రాష్ట్ర యంత్రాంగం అంతా అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజ్‌కోట్ వెస్ట్ స్థానం నుంచి పోటీలో ఉన్న సీఎం విజయ్ రూపానీకి దన్నుగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. ఇతర స్థానాల్లో కీలక నియోజకవర్గాల్లో ఇతర కేంద్ర మంత్రులు.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ప్రచారంలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ వ్యూహాలను మార్చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి.

English summary
Foot soldiers of the Rashtriya Swayamsevak Sangh (RSS), the ideological parent of the Bharatiya Janata Party, are reaching out to voters in poll-bound Gujarat, asking them to participate in the electoral exercise and choose carefully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X