బిజెపికి షాక్: ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావు: ఈసీ

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మంగళవారం నాడు చోటుచేసుకొన్న రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటుచేసుకొంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయంటూ ఎన్నికను రద్దుచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్‌ను కొనసాగించాలని బిజెపి డిమాండ్ చేసింది.

ట్విస్ట్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా బ్యాలెట్ పేపర్లను తెచ్చి ఓట్లు వేశారని వారి ఓట్లను చెల్లనివిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

అయితే ఈ విషయమై కాంగ్రెస్, బిజెపిలు మూడు దఫాలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. తమ తమ వాదనలను విన్పించారు. అయితే ఈ వాదనలను విన్న తర్వాత మంగళవారం నాడు అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించింది.

ట్విస్ట్‌లపై ట్విస్ట్: నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్, కొనసాగుతున్న హైడ్రామా

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపికి ఓటు చేశారు. బోలాబాయ్ గోహిల్, రాఘవ్‌బాయ్ పటేల్‌లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్‌కు కాకుండా బిజెపికి ఓటు చేశారు.

 Gujarat Rajya Sabha Election: Votes Of 2 Congress Legislators Declared Invalid

అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 176 మంది తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. అయితే ఇద్దరి ఓట్లు చెల్లుబాటుకాకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 44కు చేరుకొంది. 44 ఓట్లు వస్తే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అవుతారు.

Congress Slaps BJP In Punjab Gets Majority, Manipur

ఈసీ నిర్ణయంతో అహ్మద్‌పటేల్ మద్దతుదారులు సంబరాల్లో మునిగితేలారు. అయితే ఈ నిర్ణయం బిజెపికి ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Election Commission declared votes of Congress MLAs Bhola Bhai Gohil and Raghav Bhai Patel as invalid.
Please Wait while comments are loading...