H1B వీసా దొరక్క భారత్ లో చిక్కుకుపోయారా ? అమెరికా నిపుణుల టిప్స్..!
అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వలసలపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్1బీ వీసాలను తగ్గించడం లేదా రద్దు చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత హెచ్1బీ వీసాలపై ఏటా లక్ష డాలర్ల ఫీజు కట్టాలంటూ అమెరికన్ కంపెనీలకు ఆదేశాలిచ్చారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో కొత్తగా హెచ్1బీ వీసాలు ఇచ్చే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా సోషల్ మీడియా తనిఖీల రచ్చతో భారత్ లో హెచ్1బీ వీసా ఇంటర్వూలు ఆలస్యం చేయించారు. చివరికి వాటిని రెండు నెలల పాటు వాయిదా వేసేశారు.
దీంతో హెచ్1బీ వీసాల కోసం ఇంటర్వ్యూలు ఎదుర్కొనేందుకు అపాయింట్ మెంట్ల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీ షాక్ తగిలింది. అదే సమయంలో వారికి ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వీసాల్ని సైతం తాత్కాలికంగా రద్దు చేస్తూ మరో నిర్ణయం తీససుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల పరిస్దితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ఇదే క్రమంలో అమెరికా నుంచి హెచ్1బీ ఇంటర్వ్యూల కోసం వచ్చే రెండు నెలల్లో అపాయింట్ మెంట్లు తీసుకోవద్దంటూ ఇక్కడ చిక్కుకుపోయిన సాటి భారతీయులే వారిని వేడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల కోసం వెళ్లి అపాయింట్ మెంట్ల వాయిదాతో భారత్ లో చిక్కుకుపోయిన వారికి అమెరికా ఇమ్మిగ్రేషన్ నిపుణులు తాజాగా కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా తమ ఉద్యోగాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాలని వారు భారతీయులకు సూచిస్తున్నారు. ఇందుకోసం వర్క్ ఫ్రమ్ హోం తీసుకోవాలని లేదా ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్లు కోరాలని సూచిస్తున్నారు.

అలా చేయకపోతే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు కోల్పోయి అనవసరంగా అమెరికన్ కంపెనీలపై కొత్త వీసాల కోసం ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు భారం మోపిన వారు అవుతారని భారతీయుల్ని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వీరు ఉద్యోగం పోగొట్టుకుంటే జూన్ లేదా జులైలో కొత్త ఉద్యోగం వెతికితే కంపెనీలు వీరి కోసం లక్ష డాలర్ల వీసా ఫీజు చెల్లించేందుకు ఇష్టపడవని చెప్తున్నారు. ఇది మరింత ప్రమాదకర పరిస్దితులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్1బీ వీసాదారులకు కూడా ఇప్పుడు వాటి పొడిగింపు కోసం భారత్ కు వెళ్లొద్దని కూడా సూచిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications