వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్దిక్ పటేల్ మీద దోపిడి కేసు పెట్టారు

|
Google Oneindia TeluguNews

సూరత్: పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హర్దిక్ పటేల్ మీద కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్ని వీలైతే అన్ని కేసులు నమోదు చెయ్యాలని పోలీసులు భావిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాగుజరాత్ పోలీసులు మాత్రం వారి పని వారు చేసుకు వెళుతున్నారు.

హర్దిక్ పలేట్ మీద ఇప్పుడు దోపిడి కేసు నమోదు చేశారు. 2015 జులై 23వ తేదీన విస్ నగర్ పట్టణంలో హర్దిక్ పటేల్ సారథ్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా ర్యాలీతో పాటు పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అదే సందర్బంలో విధ్వంసం చోటు చేసుకోవడంతో దోపిడీలు జరిగాయి.

ఈ ఘటనకు హర్దిక్ పటేల్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతని మీద పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే హర్దిక్ పటేల్ మీద దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Hardik Patel booked for dacoity case in Visnagar police station

అక్టోబర్ 3వ తేదిన సూరత్ లో రిజర్వేషన్ల కోసం ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అవసరం అయితే పోలీసులను చంపడంటూ హర్దిక్ పటేల్ అతని వర్గానికి చెందిన యువకులకు పిలుపునిచ్చాడని సూరత్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలోనే సూరత్ పోలీసులు దేశద్రోహం కింద హర్దిక్ పటేల్ మీద కేసు నమోదు చేశారు. అంతే కాకుండా మెహసానా జిల్లాలో హర్దిక్ పటేల్ మీద పలు కేసులు నమోదు చేశారు. పటేల్ రిజర్వేషన్ల కోసం ఎన్ని కేసులు పెట్టినా భయపడను అని హర్దిక్ పటేల్ ఇంతకు ముందే పలు సార్లు చెప్పాడు.

English summary
Mehsana police said they would seek his custody from Surat police through a transfer warrant. We have enough evidence against Hardik to book him under sections of dacoity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X