పన్నీర్ కు సిఎం పదవి లేదు, పన్నీర్ తో పళని గ్రూప్ రాజీకి కారణమిదే

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:అన్నాడిఎంకెలో చోటుచేసుకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా సమసిపోలేదు. శశికళ కుటుంబాన్నిపార్టీ నుండి సాగనంపాలనే నిర్ణయాన్ని తీసుకొన్న తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి పన్నీర్ సెల్వం వర్గం పెద్ద డిమాండ్లను ముందుకు తీసుకు వచ్చింది.అయితే ముఖ్యమంత్రి పదవిని పన్నీర్ సెల్వం కోరడం లేదని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ప్రకటించారు.అయితే గురువారం నాడు తన వర్గం ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం సమావేశం కానున్నారు.

మంగళవారం రాత్రి అన్నాడిఎంకె కు చెందిన పార్టీ సీనియర్లు, మంత్రులు సమావేశమై పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని సాగనంపాలని నిర్ణయం తీసుకొన్నారు.పార్టీ నుండి మన్నార్ గుడి మాఫియాను తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

పన్నీర్ సెల్వం, పళనిస్వామి గ్రూప్ లు ఏకం కావాలనే నిర్ణయానికి వచ్చాయి.అయితే ఈ విషయమై రెండు గ్రూపుల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. ఏకాభిప్రాయం కోసం రెండు గ్రూపులు ప్రయత్నాలను ప్రారంభించాయి.

మరోవైపు అన్నాడీఎంకె మాజీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కూడ తోకముడవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.

పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని కోరలేదన్న తంబిదురై

పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని కోరలేదన్న తంబిదురై

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరలేదని లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ , పార్టీ సీనియర్ నాయకుడు తంబిదురై చెప్పారు. పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తంబిదురై చెప్పారు. పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. రెండు గ్రూపుల విలీనం నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ఆయన కొట్టిపారేశారు.

ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న పన్నీర్

ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న పన్నీర్

గురువారం నాడు తన వర్గం ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సమావేశం కానున్నారు.దినకరన్ ను కూడ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించిన నేపథ్యంలో పన్నీర్ వర్గం డిమాండ్లకు పళనిస్వామి వర్గం కూడ సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.అయితే ముఖ్యమంత్రి పదవి కాకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పన్నీర్ కు ఇచ్చే అవకాశాలున్నాయి.అయితే పన్నీర్ వర్గీయులు మాత్రం ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో గురువారం నాడు పన్నీర్ మరోసారి తన వర్గీయులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎన్నికల గుర్తు కోసమే విలీనానికి పళనివర్గం సై

ఎన్నికల గుర్తు కోసమే విలీనానికి పళనివర్గం సై

పార్టీ ఎన్నికల గుర్తు పన్నీర్ సెల్వం వర్గీయులకు దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.ఈ సమయంలోనే దినకరన్ మధ్యవర్తి ద్వారా ఎన్నికల కమిషన్ అదికారులకు లంచం ఇవ్వజూపారనే కేసు కూడ నమోదైంది.అయితే ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని పళనిస్వామి వర్గం కూడ పన్నీర్ తో రాజీకి సిద్దమైంది. అయితే ప్రధానంగా పార్టీ ఎన్నికల గుర్తు కోసమే అనేది పన్నీర్ సెల్వం గ్రూపుతో పళని గ్రూప్ సయోధ్యకు సిద్దమైంది.

 ప్రధాన కార్యదర్శిని తొలగించే అధికారం ఎవరికీ ఉంటుంది

ప్రధాన కార్యదర్శిని తొలగించే అధికారం ఎవరికీ ఉంటుంది

నిజానికీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి నుండి ఎవరినైనా పార్టీ నుండి తొలగించే అధికారం పార్టీ ప్రీసీడియం ఛైర్మెన్ కు ఉంటుంది.అయితే ప్రస్తుతం ఈ పదవిలో మధుసూధన్ ను తొలగించి సెంగోట్టియన్ ను శశికళ నియమించింది.


అయితే సెంగోట్టియన్ కూడ పళనిస్వామి వర్గం వైపే ఉన్నారు. అయితే పార్టీనుండి ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవులనుండి ఒక్క మాటతో తొలగించే అధికారం సెంగోట్టియన్ కు ఉంటుంది.ఇదిలా ఉంటే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తనకు కట్టబెట్టాలని సెంగోట్టియన్ కోరుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High drama continues in AIADMK, Panneer selvam will meeting with his followers on thursday,no chance to elect as cm panner selvam, said parthy leader palani group.
Please Wait while comments are loading...