వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి రోజు 40 కి.మీ జాతీయ రహాదారుల నిర్మాణం : నితిన్ గడ్కరీ

|
Google Oneindia TeluguNews

రెండవ సారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అభివృద్దిపై దృష్టి సారించింది. ఈనేపథ్యంలోనే అధికారిక భాద్యతలు చేపట్టిన తర్వాత రోడ్ల అభివృద్ది పై సమీక్ష నిర్వహించారు కేంద్ర జాతీయ రహదారులు, మరియు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని హైవేల నిర్మాణానికి 15 లక్షల కోట్ల రుపాయలతో బ్లూ ప్రింట్ సిద్దం చేశామని ఆయన తెలిపారు.

హైవే గ్రిడ్ ఏర్పాటు చేయడం ద్వార దేశంలోని జీడీపీకి వృద్దిరెడు పెరుగుతుందని తెలిపారు. మరోవైపు దేశంలో ఉన్న పెండింగ్ హైవేలు రానున్న వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కాగా దేశ వ్యాప్తంగా 225 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటిలో 25 ప్రాజెక్టులు మినహ మిగతా ప్రాజెక్టులు వందరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.గత ప్రభుత్వంలో హైవేలపైనే 11 లక్షల కోట్ల రుపాయలను ఖర్చుపెట్టమాని అన్నారు.

highway building target to 40 km a day: Nitin Gadkari

కాగా రెండవ సారీ బీజేపీకి అభివృద్దిని కోరుతూ తీర్పు ఇచ్చారని పార్టీలు, కుల మతాలకు అతీతంగా ఓట్లు వేశారని అయన అన్నారు. అందుకే అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రస్థుతం 32 కిలోమీటర్ల రోడ్లను నిర్మణం చేస్తున్నామని అయితే ఇక నుండి ప్రతి రోజు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో కూడ ఈ శాఖ ద్వార చేపట్టిన పనులు సంతృప్తిని ఇచ్చాయని అన్నారు.

English summary
A go getter in Prime Minister Narendra Modi's cabinet, Union Minister Nitin Jairam Gadkari in his second innings has lined up big plans -- from infusing Rs 15 lakh crore in highways to propelling GDP growth by globalising khadi and MSME products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X