మాజీ ప్రధాని మనవడి తలరాత మార్చేసిన చీర..! రేప్ కేసులో బిగ్ ట్విస్ట్..!
కర్నాటక జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు తాజాగా ట్రయల్ కోర్టు రేప్ కేసులో దోషిగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో ఇంత పక్కాగా పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యాలు సమర్పించి ఆయనకు జీవిత ఖైదు వేయించడం వెనుక ఓ చీర కీలకంగా మారిందట. ఆ చీరే ఇంత రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ప్రజ్వల్ జీవిత ఖైదుకు కారణం కావడంతో పాటు ఆ కుటుంబ పరువు కూడా తీసేసింది.
47 ఏళ్ల పని మనిషిని మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం చేసినట్లు తాజాగా కోర్టు తేల్చింది. అయితే ఈ అత్యాచారం కేసులో ప్రజ్వల్ ఇంత సులువుగా దొరికిపోవడానికి మాత్రం బాధితురాలి చీరే కారణమైందట. అత్యాచారం చేసిన రోజు పని మనిషి వేసుకున్న చీరను తొలగించిన ప్రజ్వల్.. దాన్ని తిరిగి ఆమెకు ఇవ్వలేదు. అలాగే ఆమెను ఇంటికి పంపేశాడు. అయితే ఆ చీరను లైట్ తీసుకున్నాడు. రేప్ తర్వాత ఆ చీరను ఆయన ఫామ్ హౌస్ లో అటక మీద పారేశాడు.

ఆ తర్వాత బాధితురాలు ప్రజ్వల్ పై రేప్ ఆరోపణలు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసి వాంగ్మూలాలు, ఆాధారాలు సేకరించడం ప్రారంభించారు. అప్పుడు బాధితురాలిని పోలీసులు రేప్ జరిగినప్పుడు ధరించిన బట్టలపై ఆరా తీసారు. దానికి ఆమె.. తన చీర తిరిగి ఇవ్వలేదని వెల్లడించింది. దీంతో సదరు చీరను ఫోరెన్సిక్ బృందాల సాయంతో కనుగొన్న పోలీసులు ల్యాబ్ కు పంపారు. దానిపై ప్రజ్వల్ వీర్యం ఆధారాలు లభించాయి. ఇదే చివరికి ఆయన్ను ఈ కేసులో దోషిగా తేల్చింది.

ఇతర ఆధారాలతో సంబంధం లేకపోయినా ఈ చీరపై ఉన్న ఆయన వీర్యమే రేప్ కేసులో ప్రజ్వల్ ను దోషిగా నిలబెట్టాయి. దీంతో ట్రయల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి 11 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇంత పక్కాగా ఆధారాలు ఉన్న కేసులో ప్రజ్వల్ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా తప్పించుకునే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications