Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో క్యాబ్ దందాకు చెక్ పెట్టిన మహిళ..! 2 వేలు ఆదా..!

కర్నాటక రాజధాని బెంగళూరులో జనం ట్రాఫిక్ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగాలు ప్రయాణాలు సాగించాలంటే భయపడే పరిస్ధితి. ఇందులోనూ వర్షం కురిసిందంటే ఇక వారి కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఆటో వాలాలు, క్యాబ్ ల దోపిడీ దారుణంగా ఉంటోంది. దీనిపై ఇప్పటికే జనం మండిపడుతున్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఓ మహిళ స్మార్ట్ గా వ్యవహరించడం ద్వారా ఆటో క్యాబ్ దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు భారీగా డబ్బును ఆదా చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఇతరులు కూడా వెంటనే ఈ ప్లాన్ ను అమల్లో పెట్టేస్తున్నారంట. ఇంతకీ ఆ మహిళ ఆటో క్యాబ్ లో ప్రయాణానికి బదులు ఎంచుకున్న స్మార్ట్ ప్లాన్ ఏంటన్న దానిపైనా చర్చ జరుగుతోంది. ఇంతకాలం ఈ ప్లాన్ అమలు చేసి ఉంటే తాము కూడా భారీగా డబ్బు ఆదా చేసుకునే వాళ్లమని తోటి ప్రయాణికులు అనుకుంటున్నారట.

How Combining Namma Metro and BMTC Helped Bengaluru Woman Save 2 000 on Commute

బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆటో క్యాబ్ ల దోపిడీని భరించలేక ప్రజా రవాణాను వాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని తెలుసుకోవాలని భావించింది. ఆగస్టు 18 నుంచి 22 మధ్య ఆమె క్యాబ్‌లను పూర్తిగా వదిలివేసి ఆఫీసు ప్రయాణాలు , వ్యక్తిగత ప్రయాణాల కోసం కేవలం బీఎంటీసీ బస్సులు, నమ్మ మెట్రోలో మాత్రమే రాకపోకలు సాగించింది. ఇలా చేసిన తర్వాత తన ప్రయాణ అనుభవాల్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఇలా ప్రజా రవాణాలో ప్రయాణాలు చేయడం ద్వారా తను వారంలోనే 2 వేల రూపాయలు ఆదా చేసినట్లు ఆమె వెల్లడించింది.

How Combining Namma Metro and BMTC Helped Bengaluru Woman Save 2 000 on Commute

ఆగస్టు 18న మొదలుపెట్టి తన ప్రయాణాలు ఎలా సాగాయో వివరిస్తూ సుదీర్ఘంగా ఆమె ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో ఆమె ప్రజా రవాణా సౌకర్యాలు అయిన బీఎంటీసీ బస్సులు, నమ్మ మెట్రోలో ఎప్పుడెప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణాలు చేసింది, తద్వారా ఆమె ఎంత ఖర్చు చేసింది, ఎంత ఆదా చేయగలిగిందో సమగ్రంగా వివరించింది. తద్వారా ఆమె 2 వేల రూపాయలు ఆదా చేయగలిగినట్లు లెక్క వేసింది. దీంతో ఇదే పని తాము ఎందుకు చేయలేకపోతున్నామో అని సాటి బెంగళూరు వాసులు చర్చించుకునేలా చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+