వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్జికల్ స్ట్రైక్ : ఆపరేషన్ మొత్తాన్ని లైవ్ లో వీక్షించింది ఆ ముగ్గురే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 'సర్జికల్ స్ట్రైక్స్'.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు అందరి నోళ్లలోను నానుతోన్న పేరు. పాక్ పై భారత సైన్యం చేపట్టిన ఈ చర్య ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగాను చర్చనీయాంశంగా మారింది. అత్యంత పకడ్బందీగా.. పక్కా స్కెచ్ గీసి మరీ ఈ ఆపరేషన్ ను నిర్వహించడం పట్ల.. అటు ఇండియన్ ఆర్మీతో పాటు ఇటు ఆపరేషన్ కు దిశా నిర్దేశం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ బల్బీర్ సింగ్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

నియంత్రణ రేఖ నుంచి 3 కి.మీ చొచ్చుకెళ్లిన సైనికులు.. 40 మంది ఉగ్రవాదులతో పాటు 8 పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ఆపరేషన్ కు డైరెక్షన్స్ ఇచ్చిన అజిత్ దోవల్, బల్బీర్ సింగ్ తో పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ లైవ్ లో వీక్షించార్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి బుధవారం నాడు ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ లో జరిగిన డిన్నర్ పార్టీకి ఈ ముగ్గురు హాజరుకావాల్సి ఉన్నా.. పాక్ పై చేయబోతున్న సర్జికల్ స్ట్రైక్ ను దృష్టిలో ఉంచుకుని పార్టీకి గైర్హాజరయ్యారు. అదే సమయంలో సర్జికల్ స్ట్రైక్ ను అమలు చేయాల్సిన తీరు.. అనుసరించాల్సిన వ్యూహంపై ముగ్గురి మధ్య చాలాసేపు చర్చ నడిచినట్టు తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ మొత్తాన్ని ఈ ముగ్గురు లైవ్ లో వీక్షించడానికి కూడా ఏర్పాట్లు జరిగాయట. ప్రత్యేక డ్రోన్ల సహాయంతో ఆపరేషన్ మొత్తాన్ని లైవ్ ద్వారా ఈ ముగ్గరు వీక్షించినట్టు సమాచారం.

How the Doval war-room worked on Wednesday night

బుధవారం రాత్రి 12.30గం.ల ప్రాంతంలో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ ను ప్రారంభించగా.. అంతకు నాలుగు గంటల ముందే ఆపరేషన్ కు సంబంధించిన సన్నాహాకాలను పూర్తి చేసుకుని సరైన సమయం కోసం వేచి చూసినట్టుగా సమాచారం. ఇకపోతే సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించింది టార్గెట్స్ ఫిక్స్ చేయడం దగ్గరి నుంచి.. దాడులు ఎలా చేయాలన్న అంశాలపై అజిత్ దోవల్ సూచించిన వ్యూహాలనే అనుసరించారట. పాక్ లో దాదాపు ఏడేళ్లపాటు అండర్ కవర్ లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో ఆపరేషన్ వ్యవహారం మొత్తం ఆయన డైరెక్షన్ లోనే సాగినట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఆపరేషన్ ను షురూ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మాత్రం రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అని తెలుస్తోంది. ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీ రక్షణశాఖ జాగ్రత్తగా భద్రపరిచినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పట్లో ఈ వీడియో బయటకు వస్తుందా..? రాదా? అన్నది అనుమానమే.

English summary
Thursday morning’s anti-terror operation along and near the Line of Control in Kashmir was a test case for the new standard operating procedures that national security adviser Ajit Doval wants to put in place for a long-term strategy to neutralise the menace of cross-border terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X