వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూతవైద్యంతో దుష్టశక్తుల్ని తరిమేశా-ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ షాకింగ్ కామెంట్స్-వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

విద్యార్దులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధించాల్సిన ఐఐటీ మండీ డైరెక్టర్ స్వయంగా అశాస్త్రీయ విధానాల్ని ప్రోత్సహించేలా ఓ కార్యక్రమం చేపట్టడం, దాన్ని వీడియో ద్వారా ఇతరులకు పంచుకోవడం వివాదాస్పదమైంది. ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నతన స్నేహితుల తల్లితండ్రులను దుష్ణశక్తుల నుంచి కాపాడేందుకు తాను భూతవైద్యం చేసినట్లు ఐఐటీ మండీ ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహరా చెప్తున్న వీడియో సంచలనం రేపింది.

ఐఐటీ కాన్పూర్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న లక్ష్మీధర్ బెహెరా రెండ్రోజుల క్రితం ఐఐటీ మండి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌ను, తల్లిదండ్రులను పవిత్ర మంత్రాలను పఠించడం ద్వారా "దుష్టశక్తుల" నుండి బయటపడేందుకు భూతవైద్యం చేసినట్లు చూపుతూ ఓ వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. దీంతో వివాదం మొదలైంది.

కాన్పూర్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ అయిన బెహరా.. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్ డీ పూర్తి చేశారు. అలాగే జర్మన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పోస్ట్-డాక్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో స్పెషలైజేషన్ కూడా పూర్తి చేశారు. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో, ఆయన ప్రతిరోజూ 800 మంది వీధి పిల్లలకు ఆహారం ఇవ్వడానికి క్యాంపస్‌లో కమ్యూనిటీ కిచెన్‌ను కూడా నడిపారు. ఆయన దాతృత్వ చర్యను విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏప్రిల్ 15, 2020న ట్వీట్ ద్వారా షేర్ కూడా చేశారు.

IIT mandi directors Shocking Video Comments : Rid friend’s parents of evil spirits via chants

ఇప్పుడు ఆయన విడుదల చేసిన ఐదు నిమిషాల క్లిప్‌లో, బెహెరా 1993లో తన స్నేహితుడి కుటుంబం దెయ్యాల బారిన పడిందని తెలిసి బాధలో ఉన్న స్నేహితుడికి సహాయం చేయడానికి చెన్నైకి వెళ్లడాన్ని వివరించారు. తాను 'హరే రామ హరే కృష్ణ' మంత్రాన్ని పఠించడంతో పాటు "భగవద్గీతలోని ఆలోచనలు, జ్ఞానాన్ని సాధన చేయడం ప్రారంభించానని, పవిత్ర నామం యొక్క శక్తిని ప్రదర్శించడానికి తన స్నేహితుడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత తన స్నేహితుడి అపార్ట్ మెంట్ కు వెళ్లి అక్కడ తన దుష్టశక్తుల బారిన పడిన తన తల్లి తండ్రులను మంత్రాలు చదివి ఎలా కాపాడారో వివరించారు. ఇందుకోసం 45 నిమిషాల సమయం పట్టిందన్నారు.

ఈ వ్యాఖ్యలు కాస్తా వైరల్ కావడంతో.. దీనిపై లక్ష్మీధర్ బెహరా స్పందించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చాలా ఘటనలను , అనుభవాలను వివరించలేదన్నారు. ఈ వీడియో ఏడు నెలల క్రితం యూట్యూబ్‌లో "లెర్న్ గీత లైవ్ గీత " అనే పేజీలో పోస్ట్ చేశారు. తాజా వివాదం నేపథ్యంలో ఈ వీడియోను ప్రైవేట్ లోకి మార్చేశారు.

English summary
iit mandi's director laxmidhar behera's comments in a video turns controversial after he reveals that he saves his friends's parents from evils via act of exorcism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X