నిరసనల్లో పాల్గొన్న హీరో ఇమ్రాన్ ఖాన్ కు పోలీసుల షాక్- దేశ బహిష్కరణ ఆదేశాలు..!
బాలీవుడ్ సీనియర్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, స్వయంగా నటుడు కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ముంబై పోలీసులు షాకిచ్చారు. ఆయన్ను ఈ నెల 28 కల్లా దేశం విడిచి వెళ్లాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు. ముంబైలో జరిగిన సీఈసీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ ను ఈ మేరకు దేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
స్వతహాగా అమెరికా పౌరుడు అయిన ఇమ్రాన్ ఖాన్.. ఈ నెల 10వ తేదీన ముంబైలో జరిగిన సీఈసీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం విడిచి పెట్టారు. సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్లో గుమిగూడిన వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన భాగస్వామి, నటి లేఖా వాషింగ్టన్, ఆయన బంధువు జైన్ మేరీ ఖాన్ కూడా ఉన్నారు. ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా ముంబై పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఇప్పుడు ఇమ్రాన్ భారత పౌరుడు కానప్పటికీ నిరసనలో పాల్గొన్నారనే ఆరోపణలపై, ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిబంధనల కింద ఆయనపై చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 28 కల్లా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు పోలీసుల చర్యలకు ముందే బీజేపీ నేత కిరీట్ సోమయ్.. ఇమ్రాన్ను దేశం నుండి బహిష్కరించాలని ముంబై పోలీసులను కోరడం విశేషం. ఇమ్రాన్ ఖాన్న అమెరికా పౌరుడని పేర్కొంటూ అతనిని దేశం నుండి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పౌరసత్వాన్ని ధృవీకరించాలని సోమయ్య ముంబై పోలీసులను కోరారు ఒక విదేశీయుడు రాజకీయ ఆందోళనలో పాల్గొనడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.














Click it and Unblock the Notifications
