ఇప్పటికి ఆపాం....తేడా వస్తే .. పాక్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..!!

భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాలూ కాల్పుల్ని ఆపేశాయి. అంతే కాదు భూతల, వాయు, జల మార్గాల్లో ఎలాంటి దాడులకు దిగరాదని నిర్ణయించాయి. ఈ మేరకు ఇరుదేశాలూ ప్రకటనలు చేశాయి. అయితే గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘించిన చరిత్ర ఉన్న పాకిస్తాన్ కు భారత్ తాజాగా మరో హెచ్చరిక చేసింది.

భారత్, పాక్ మధ్య ఇవాళ జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామని, అయితే ఉల్లంఘనలకు పాల్పడి కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం దీటుగా ప్రతిస్పందన ఉంటుందని ఇవాళ సైన్యం ప్రకటించింది. ఈ మేరకు కమొడోర్ రఘు నాయర్ పొరుగు దేశానికి కీలక హెచ్చరికలు చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించినా తాము మాత్రం పూర్తి సన్నద్ధంగా ఉంటామని, అప్రమత్తంగా ఉంటామని తెలిపారు.

india issued stern warning to Pakistan against ceasefire violation after key announcement

భవిష్యత్తులో పాకిస్తాన్ నుండి ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే మాత్రం భారత సాయుధ దళాలు నిర్ణయాత్మక ప్రతిస్పందనకు సిద్గంగా ఉన్నట్లు కమొడోర్ రఘు నాయర్ తెలిపారు. మాతృభూమి సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ చేసే ప్రతి దుస్సాహసాన్ని అడ్డుకున్నామని, భవిష్యత్తులో జరిగే ప్రతి దాడీ తమ నుంచి నిర్ణయాత్మక ప్రతిస్పందనకు కారణమవుతుందని ఆయన తెలిపారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఏవైనా కార్యకలాపాలను ప్రారంభించడానికి తాము పూర్తిగా కార్యాచరణపరంగా సిద్ధంగా ఉన్నామన్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం యొక్క ప్రతిస్పందన చాలా కచ్చితత్వంతో, చాలా బాధ్యతాయుతంగా" చేపట్టామని కమోడోర్ నాయర్ తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ తప్పుడు సమాచారం వ్యాప్తిని ఆయన తప్పుబట్టారు. పాకిస్తాన్ తన జేఎఫ్-17 విమానం, భారతదేశ ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి స్థావరంపై దాడి జరిగినట్లు చేస్తున్న ప్రచారం అంతా ఫేక్ అని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. భారత వైమానిక స్థావరాలు, మందుగుండు సామగ్రి నిల్వలను దెబ్బతీశారనే పాకిస్తాన్ వాదనలను కూడా ఆమె తోసిపుచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+