వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఆర్మీ: హెల్మెట్ పెట్టుకోవడాన్ని సిక్కులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సిక్కులు

సిక్కు మతానికి చెందిన సైనికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని భారత ఆర్మీ నిర్ణయించడం వివాదాస్పదమైంది.

హెల్మెట్ ధరించడాన్ని సిక్కు మత సంస్థలతో పాటు కొందరు రాజకీయ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

సిక్కులకు తలపాగ అనేది వారి మత విశ్వాసాలలో చాలా ముఖ్యమైనది. కాబట్టి హెల్మెట్లు పెట్టుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.

భారత సైన్యం ఇటీవల సిక్కు సైనికుల కోసం ప్రత్యేకంగా బాలిస్టిక్ హెల్మెట్లు కొనుగోలు చేయడానికి ఆర్డర్ చేసింది.

భారత సైన్యంలో పెద్ద సంఖ్యలో సిక్కు సైనికులు ఉన్నారు. సిక్కు మత విశ్వాసాల ప్రకారం ఇప్పటి వరకు హెల్మెట్ ధరించకుండా వారికి మినహాయింపు ఇస్తూ వచ్చారు.

అయితే 400 మీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఇప్పుడు సిక్కు సైనికుల కోసం ప్రత్యేకంగా హెల్మెట్స్ కొనుగోలు చేయనున్నారు.

ఈ మేరకు 12,370 హెల్మెట్‌లు కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది.

ఇందులో భాగంగా 8,911 లార్జ్ , 3,819 ఎక్స్‌ట్రా లార్జ్ హెల్మెట్లను ఆర్డర్ ఇవ్వనున్నారు.

భారత సైన్యంలోని సిక్కు రెజిమెంట్, సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీ, పంజాబ్ రెజిమెంట్‌లలో పెద్ద సంఖ్యలో సిక్కు సైనికులు ఉన్నారు.

సిక్కుల మత విశ్వాసాల ప్రకారం, ఇప్పటి వరకు వారికి హెల్మెట్ ధరించకుండా మినహాయింపు ఇచ్చారు.

ఇప్పుడు ఇతర సైనికుల మాదిరిగానే సిక్కు సైనికుల భద్రత కోసం ప్రత్యేక హెల్మెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ హెల్మెట్ల టెండర్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2023 జనవరి 27. టెండర్లు ఆధారంగా కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నారు.

సిక్కు సైనికుల తలపాగ విషయంలో సైన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది.

అయితే, ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో అదనపు భద్రతను అందించే ఉద్దేశంతో ప్రత్యేక హెల్మెట్లను ఉపయోగించాలని సైన్యం నిర్ణయించింది.

చాలా రాజకీయ సంప్రదింపులు, సిఫార్సుల తర్వాత మాత్రమే సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

సిక్కులు

'తలపాగా కేవలం వస్త్రం కాదు'

శిరోమణి గురుద్వారా పరబంధక్ కమిటీ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

సైన్యం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శిరోమణి గురుద్వారా పరబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి డిమాండ్ చేశారు.

'భద్రతా కారణాలను చూపుతూ సిక్కులను తలపాగ తీసి హెల్మెట్ పెట్టుకోమని అంటున్నారు. వారికి సిక్కు మత విశ్వాసాలు తెలియవు. తలపాగకు మేం ఇచ్చే విలువ తెలియదు.

తలపాగా కేవలం వస్త్రం కాదు. ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యతతో పాటు సిక్కుల ఉనికికి చిహ్నంగా ఉంది.

తలపాగా సిక్కుల గర్వం. గురువు ఆదేశాలకు కట్టుబడి ఉండటానికి ప్రతీక.

సిక్కు సైనికులు హెల్మెట్ ధరించాలని ఒత్తిడి చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసింది" అని ఆయన అన్నారు.

అకల్ తఖ్త్‌కు చెందిన జతేదార్ జియానీ హర్‌ప్రీత్ సింగ్ కూడా హెల్మెట్ల నిర్ణయాన్ని 'సిక్కు గుర్తింపుపై దాడి' అని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తలపాగాకు బదులు హెల్మెట్ ధరించేలా చేయడాన్ని సిక్కు గుర్తింపును అణిచివేసే ప్రయత్నంగా చూస్తామని ఆయన హెచ్చరించారు.

"రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కూడా అదే విధంగా ప్రయత్నించింది.

అయితే సిక్కులు ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారు. సిక్కు తలపై తలపాగా అనేది కేవలం 5-7 మీటర్ల వస్త్రం కాదు. గురువులు ఇచ్చిన కిరీటం. అది మన గుర్తింపులో భాగం, ఒక చిహ్నం" అన్నారు హర్‌ప్రీత్ సింగ్.

పంజాబ్‌లోని అకాలీదళ్ పార్టీ కూడా భారత సైన్యం నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ "సిక్కులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మతపరమైన గుర్తింపుపై దాడి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నా" అని అన్నారు.

సిక్కు మతంలో అనుచరులకు ఐదు వస్తువులు కేష్ (పొడవాటి కత్తిరించని జుట్టు), చెక్క దువ్వెన, కడ, కిర్పాన్ (చిన్న ఆయుధం), కషహార (లోదుస్తులు) తప్పనిసరి.

గతంలో ఈ సంప్రదాయానికి భిన్నంగా జరిగిన ఘటనలేంటి?

సిక్కులు తమ తల లేదా గడ్డం జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. వారు తమ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడానికి ఎల్లప్పుడూ చెక్క దువ్వెన ఉంచుకుంటారు.

భద్రత కోసం కృపాన్ అనే ఆయుధం ఉపయోగిస్తారు. ఇది కాకుండా సిక్కుమతంలో ఎల్లప్పుడూ కషాహారా అంటే కాటన్ లోదుస్తులను ధరించడం కూడా తప్పనిసరి.

సిక్కులు తమ జుట్టును కట్టివేయడానికి, చక్కగా ఉంచడానికి తలపాగాను ఉపయోగిస్తారు. దీనినే దస్తర్ అని కూడా అంటారు.

సిక్కులు భారతదేశంలోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో సహా అనేక యూరోపియన్ దేశాలలో కూడా నివసిస్తున్నారు.

సైనిక సేవలో ఉన్న సిక్కులు ఫ్రాన్స్ మినహా దాదాపు అన్ని దేశాలలో తలపాగా ధరించడానికి అనుమతి ఉంది.

అయితే ప్రస్తుతం కొత్త తరానికి చెందిన కొందరు సిక్కు యువకులు మత సంప్రదాయానికి భిన్నంగా జుట్టు కత్తిరించుకోవడం ప్రారంభించారు. అంతేకాదు తలపాగాలు కూడా ఉపయోగించరు.

సిక్కు మత సంప్రదాయం ప్రకారం పురుషులు తలపాగా ధరించడం, స్త్రీలు తమ జుట్టును పరదాతో కప్పుకోవడం తప్పనిసరి.

శిరస్త్రాణం లేదా మరేదైనా వస్తువుతో తలను కప్పుకోవడాన్ని సిక్కు మతంలో టోపీని ధరించినట్లుగా పరిగణిస్తారు. అందువల్ల సిక్కులు అలాంటి వస్తువులను ఉపయోగించకుండా తలపాగా మాత్రమే ధరించే సంప్రదాయాన్ని అనుసరిస్తారు.

1988లో పంజాబ్ హైకోర్టు తలపాగా ధరించిన సిక్కులకు మాత్రమే హెల్మెట్ ధరించకుండా మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Indian Army: Why Sikhs are against wearing helmets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X