IPL 2023: శుభ్ మన్ గిల్ సెంచరీతో సచిన్ 13 ఏళ్ల నాటి అరుదైన రికార్డు బ్రేక్..

ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్ దశకు చేరుకుంటోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన తాజా మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించి ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్లింది. దీంతో మిగిలిన మూడు స్ధానాల కోసం ఇతర జట్లు పోటీ పడాల్సిన పరిస్ధితి వచ్చింది. అదే సమయంలో సన్ రైజర్స్ తో మ్యాచ్ లో గుజరాత్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఓపెనర్ శుభ్ మన్ గిల్ సాధించిన వీరోచిత సెంచరీ జట్టును గెలిపించడమే కాకుండా పలు రికార్డులు కూడా బద్దలు కొట్టింది.

సన్ రైజర్స్ తో మ్యాచ్ లో 58 బంతుల్లోనే 101 పరుగులు చేసి ఐపీఎల్ 2023లో శుభ్ మన్ గిల్ తన తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో కేవలం 22 బంతుల్లో తొమ్మిది బౌండరీల సాయంతో గిల్ యాభై పరుగులకు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో సిక్సర్ బాదకుండానే ఓ ఆటగాడు సాధించిన వేగవంతమైన అర్ధ సెంచరీ ఇది. దీంతో శుభ్ మన్ గిల్ ఓ అరుదైన రికార్డు అందుకున్నట్లయింది.

shubman gill

అంతే కాదు శుభ్ మన్ గిల్ సాధించిన ఈ సిక్సర్ లెస్ హాఫ్ సెంచరీ.. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)పై ముంబై ఇండియన్స్ ఆటగాడిగా 2010లో సచిన్ సాధించిన రికార్డును తిరగరాసింది. అప్పట్లో సచిన్ టెండూల్కర్ 23 బంతుల్లోనే సిక్సర్లు లేకుండా యాభై పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డును శుభ్ మన్ గిల్ 13 ఏళ్ల తర్వాత అధిగమించినట్లయింది.

మరోవైపు సన్ రైజర్స్ తో మ్యాచ్ లో శుభ్ మన్ గిల్.. 50 పరుగులు చేసేందుకు సిక్సర్లు కొట్టలేదు. కానీ 50 పరుగులకు చేరుకున్న తర్వాత మాత్రం గిల్ తన ఇన్నింగ్స్‌లో మరో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. అలాగే గిల్ సాధించిన సెంచరీ గుజరాత్ టైటాన్స్ తరపున ఓ బ్యాట్స్ మెన్ చేసిన తొలి సెంచరీ కూడా. గత సీజన్ లోనూ టైటిల్ ఎగరేసుకుపోయిన గుజరాత్ జట్టులో ఏ ఒక్కరూ సెంచరీ సాధించకపోవడం విశేషం. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగడమే కాకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న తొలి జట్టు కూడా అయిన టైటాన్స్.. ఈసారి టైటిల్ సాధిస్తుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+