Chandrayaan-3: చంద్రయాన్ -3 అప్ డేట్- వైఫల్యమే పాఠంగా-సాఫ్ట్ ల్యాండింగ్ కు జాగ్రత్తలు..
భారతదేశ మూడో చంద్రుడి మిషన్ చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా సాగిపోతోంది. ఇప్పటికే భూమి కక్ష్యను విజయవంతంగా దాటేసి చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టిన ఈ అంతరిక్ష నౌక.. ఇక క్రమంగా విడిపోతూ చివరికి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా ఇస్రో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చంద్రయాన్ -3 ల్యాండర్ విక్రమ్ అన్ని సెన్సార్లు, రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
#WATCH | ISRO Chairman S Somnath on Chandrayaan-3
— ANI (@ANI) August 7, 2023
"Everything is going fine now. There will be a series of manoeuvres until it lands (on the Moon) on 23rd August. The satellite is healthy." pic.twitter.com/p1hOf6oTgk
విక్రమ్ ల్యాండర్ ను ఈసారి డిజైన్ లో లోపాల్ని కూడా తట్టుకునే విధంగా తయారుచేసినట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
ప్రొపల్షన్ సిస్టమ్ బాగా పనిచేస్తే అన్ని సెన్సార్లు విఫలమైనా, ఏమీ పని చేయకపోయినా విక్రమ్ ల్యాండింగ్ అవుతుందని ఆయన వివరించారు. ఆ విధంగా దీనిని రూపొందించారన్నారు. ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అలాగే ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మరో మూడు డి-ఆర్బిటింగ్ విన్యాసాల తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయ్యేలా చంద్రుడికి దగ్గరగా తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.

ఈ డి-ఆర్బిటింగ్ విన్యాసాలు ఆగస్టు 9, ఆగస్టు 14 మరియు ఆగస్టు 16 తేదీలలో చంద్రుని నుండి 100 కిమీx100 కిమీకి తగ్గే వరకు నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేషన్ ఎక్సర్‌సైజ్, ల్యాండర్ 'డీబూస్ట్' తర్వాత, క్రాఫ్ట్‌ను నెమ్మదింపజేసే ప్రక్రియ తర్వాత వెంటనే చేపడతామన్నారు. దీని తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ఇది సాఫ్ట్ ల్యాండ్ అవుతుందని తెలిపారు. గతంలోలా ఈసారి కూడా విక్రమ్ ల్యాండర్ లో రెండు ఇంజన్లు పని చేయకపోయినా కూడా అది ల్యాండ్ అవుతుందన్నారు.
కాబట్టి అల్గారిథమ్‌లు సరిగ్గా పనిచేస్తే విక్రమ్ అనేక వైఫల్యాలను తట్టుకోగలదని నిర్ధారించుకోవడానికి దీన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఇస్రో బృందం ముందున్న అతిపెద్ద సవాలు చంద్రుని ఉపరితలంపై నిలువుగా విక్రమ్ ను ల్యాండ్ చేయడమే.ఒకసారి ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడిపోతే అది అడ్డంగా కదులుతుందని సోమనాథ్ తెలిపారు. అప్పుడు దాన్ని నిలువుగా తీసుకురావడమే ఇస్రోకు సవాల్. చంద్రయాన్-2 మిషన్ సమయంలో ఇక్కడే సమస్య ఎదురైంది. కాబట్టి ఇస్రో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications