వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ ఫ్యామిలీ, బినామీ ఆస్తులు ఇన్ని రూ. లక్షల కోట్లా ? అమ్మ ఇంటిలోని ల్యాప్ టాప్ లో !

దేశ వ్యాప్తంగా శశికళ కుటుంబ సభ్యులకు బినామీ ఆస్తులు.30 ఏళ్లలో దాదాపు రూ.. 5 లక్షల కోట్ల ఆస్తులు, మన్నార్ గుడి మాఫియా బినామీలు,పెద్ద నోట్ల రద్దు తరువాత రూ. కోట్లలో డిపాజిట్ లు, బ్యాంకు లావాదేవీలకు చెక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

IT Raids : మిడాస్ మద్యం బంద్ : కీలకంగా 'పూంగుండ్రన్' | Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులకు దేశవ్యాప్తంగా దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో వెలుగు చూసిందని తెలిసింది.

జయలలిత కొడనాడు ఎస్టేట్ వ్యవహారంలో విచారణ ముమ్మరం, శశికళ గది మీద ఐటీ కన్ను !జయలలిత కొడనాడు ఎస్టేట్ వ్యవహారంలో విచారణ ముమ్మరం, శశికళ గది మీద ఐటీ కన్ను !

శశికళ కుటుంబ సభ్యులకు గత 30 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్థిరాస్తులు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలు కొనుగోలు చేశారని, వాటిని తమ బినామీల ద్వారా నడిపిస్తున్నారని తెలిసిందని ఓ ఐటీ శాఖ ఉన్నతాధికారి అంటున్నారు. శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులు విలువ మార్కెట్ లో రూ. ఐదు లక్షల కోట్లకు పైగా ఉంటుందని ఐటీ శాఖ అధికారి చెబుతున్నారు.

అమ్మ ఇంటిలోని పెన్ డ్రైవ్ లో !

అమ్మ ఇంటిలోని పెన్ డ్రైవ్ లో !

ఇటీవల తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, నాలుగు పెన్‌ డ్రైవ్‌ల్లోని ఉన్న సమాచారాన్ని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో నిపుణుల సహకారంతో ఐటీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అక్రమాస్తులు !

దేశ వ్యాప్తంగా అక్రమాస్తులు !

వారం రోజులపాటు శశికళ ఫ్యామిలీ మీద జరిగిన ఐటీ శాఖ సోదాల్లో స్వాధీనం చేసుకున్న విలువైన పత్రాలను ఐటీ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శశికళ కుటుంబ సభ్యులకు తమిళనాడులోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లు ఐటీ శాఖ అధికారుల సోదాల్లో వెలుగు చూసింది.

బినామీల పేర్లతో ఆస్తులు !

బినామీల పేర్లతో ఆస్తులు !

ఐటీ అధికారులు మళ్లీ తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సోదాలు చెయ్యడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. శశికళ కుటుంబ సభ్యులు వారి బినామీలతో పెద్ద ఎత్తున బ్యాంకు లావాదేవీలు నిర్వహించారని ఐటీ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

పెద్దనోట్లు రద్దు, బ్యాంకుల్లో !

పెద్దనోట్లు రద్దు, బ్యాంకుల్లో !

పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత శశికళ కుటుంబ సభ్యులకు చెందిన బినామీలు వారి ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ చేసినట్లు తెలియడంతో దాదాపు 90 బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ అధికారులు స్తంభింపజేశారు. నకిలీ సంస్థలు నడుపుతున్న శశికళ బినామీలు కూడా తమ ఖాతాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా గత ఆరునెలల్లో రూ. కోట్లలో జమ చేశారని తెలిసింది.

పత్రాలు మాయం !

పత్రాలు మాయం !


శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, బినామీల ఆస్తుల వివరాలు సేకరిస్తున్న ఐటీ శాఖ అధికారులు త్వరలోనే అందరికీ నోటీసులు జారీ చేసి విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే కొన్ని కీల పత్రాలను శశికళ కుటుంబ సభ్యులు మాయం చేశారని ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
With the help of technology experts, the income tax department is scrutinising data in laptop and pen drives seized from the residence of former Tamil Nadu chief minister J Jayalalithaa, during the raid on Friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X