వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ వారసత్వ నగరంగా పింక్ సిటీ జైపూర్...యూనెస్కో ప్రకటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో గుర్తింపు పొందిన 17 పర్యాటక ప్రాంతాలను ప్రపంచస్థాయి డెస్టినేషన్‌గా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఒకరోజులోనే రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. జైపూర్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (యూనెస్కో) ప్రకటన చేసింది.

ఇదే విషయాన్ని తెలుపుతూ యూనెస్కో తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది.యూనెస్కో ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కూడా షేర్ చేశారు. జైపూర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ నగరం సంస్కృతికి శౌర్యానికి పెట్టింది పేరు అని ప్రధాని కొనియాడారు. జైపూర్ నగరం ఎంతో అందంగా ఉండటంతో పాటు చాలా శక్తివంతమైన నగరంగా మోడీ పేర్కొన్నారు. అంతేకాదు ఆతిథ్యం ఇవ్వడంలో ఈ నగరంతో ఏ నగరం పోటీపడలేదని అన్నారు. ప్రపంచ దేశాలనుంచి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే నగరం జైపూర్ అని మోడీ తన ట్వీట్‌లో తెలిపారు. ఇంతటి చరిత్ర ఉన్న జైపూర్ నగరాన్ని యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తించినందుకు అభినందనలు తెలియజేశారు.

Jaipur declared as World Heritage Site by UNESCO

జైపూర్ సిటీని పింక్ సిటీగా కూడా పిలుస్తారు. ఈ నగరంలో పలు పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇందులో అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్, మరియు హవా మహల్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.ఇక యూనెస్కో గుర్తించిన ఇతర వారసత్వ సంపద నగరాల్లో బహ్రెయిన్‌లోని దిల్మన్ బరియల్ మౌండ్స్, ఆస్ట్రేలియాలోని బుడ్జ్‌బీమ్ కల్చరల్ ల్యాండ్‌స్కేప్, చైనాలోని ఆర్కియలాజికల్ రూయిన్స్ ఆఫ్ లియాంగ్జు సిటీ, ఇండోనేషియలోని ఓంబిలిన్ కోల్ మైనింగ్ హెరిటేజ్ ఆఫ్ సవ్హాలున్తో, కోఫన్ గ్రూప్‌కు చెందిన ఫురుచీ, జపాన్‌ నగరాలు ఉన్నాయి.

English summary
A day after Finance Minister Nirmala Sitharaman announced the government’s plan to turn 17 ‘iconic’ tourist sites into world-class destinations, UNESCO announced Jaipur City in Rajasthan as a World Heritage Site in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X