వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్‌కు భంగపాటే.. దీప కొత్త పార్టీ!.. నేటి సాయంత్రం ప్రకటన!?

నేటి సాయంత్రం 5గం. ప్రాంతంలో జయలలిత మేనకోడలు దీపజయకుమార్ కొత్త పార్టీ వివరాలు ప్రకటించబోతున్నట్లుగా సమాచారం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. శశికళతో పోరులో నిన్నటిదాకా పన్నీర్ సెల్వంకు అండగా నిలబడ్డ జయలలిత మేనకోడలు దీప జయకుమార్.. ఇప్పుడు సొంత కుంపటి దిశగా కదులుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి మరో నాలుగు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో.. పన్నీర్ సెల్వం వర్గం దీప జయకుమార్ ను, శశికళ వర్గం దినకరన్ ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వెలువడిన సంగతి తెలిసిందే.

శశికళ ఓకే కానీ, మాదే: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జయ మేనల్లుడుశశికళ ఓకే కానీ, మాదే: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జయ మేనల్లుడు

కానీ ఇంతలోనే పరిస్థితి తలకిందులైంది. పన్నీర్ కు షాక్ ఇస్తూ సొంత కుంపటి పెట్టుకునేందుకే దీప మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఇంటి పరిసరాల్లో వెలిసిన కొత్త జెండాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. నలుపు, ఎరుపు, తెలుపు వర్ణాలతో ఉన్న ఈ జెండాల్లో జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై ఫోటోలు దర్శనిమస్తున్నాయి.

Jayalalalithaas niece deepa to launch party today

దీంతో గతంలో ప్రకటించినట్లుగా దీప కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జయలలిత తొలి జయంతి రోజున కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు దీప గతంలో ప్రకటించారు. మేనత్త జయలలితకు ప్రజల్లో ఉన్న ఆదరణతో తానే ఒంటరిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని దీప భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మేనత్త జయంతి సందర్బంగా శుక్రవారం నాడు దీప బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 6గం.ల నుంచే తన కార్యాచరణను మొదలుపెట్టిన దీప ఉదయం జయలలిత సమాధిని సందర్శించారు. మేనత్తకు నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ గురించి, సోదరుడు దీపక్ తీరు గురించి స్పందించారు.

దీపక్ ఇన్నాళ్లు మౌనంగా ఉండి, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండటం పట్ల దీప అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్న సంశయం వ్యక్తం చేశారు.

మేనత్త జయలలిత జయంతిని పురస్కరించుకుని ఈరోజు మధ్యాహ్నాం శివజ్ఞానం వీధిలో దీప అన్నదానం చేయనున్నారు. అనంనంతరం సాయంత్రం 5గం. ప్రాంతంలో ఆమె కొత్త పార్టీ వివరాలు ప్రకటించబోతున్నట్లుగా సమాచారం.

కాగా, దీప సోదరుడు దీపక్ కూడా శశికళ శిబిరం పట్ల యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకె పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ బాధ్యతలు చేపట్టడంతో.. పార్టీ పగ్గాలు చిన్నమ్మ కుటుంబ సభ్యుల్లోకి వెళ్లడం పట్ల దీపక్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

పార్టీ అధినేత్రిగా చిన్నమ్మకు మద్దతునిస్తాను గానీ దినకరన్ ను సమ్మతించే పరిస్థితి లేదన్నారు. అలాగే జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ కూడా తమకే చెందుతుందని దీపక్ వాదిస్తున్నారు.
అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పై జయ మేనల్లుడు దీపక్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో

English summary
At noon, Deepa will hold an annadhanam at her residence in Sivagnanam Street in T. Nagar. At 5 p.m., she will announce the name of her party and the party flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X