వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నయ్యకు విదేశీ విశ్వవిద్యాలయాల మద్దతు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశద్రోహం నేరం కింద అరెస్టైన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకు విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తోంది. యేల్‌, కాలిఫోర్నియా తదితర విశ్వవిద్యాలయ విద్యార్థులు కన్నయ్య ప్రసంగంలోని భాగాలను ఇంగ్లీష్‌లోకి అనువదించి వాటిని తమ గొంతుతో చెప్తూ వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

‘కన్నయ్య ప్రసంగం దేశద్రోహమైతే అదే పని చేస్తున్న మాదీ దేశద్రోహమే అవుతుంది. మమ్మల్నీ అరెస్టు చేయండి' అని పేర్కొని మరీ వారీ ప్రసంగాలను అప్‌లోడ్‌ చేయడం గమనార్హం.

Also Read: ‘రాజకీయ నేతలూ ఎదగండి': జేఎన్‌యూపై గంభీర్

ఈ విద్యార్థులే గాక, కొలంబియా, హార్వర్డ్‌, కేంబ్రిడ్జ్‌ తదితర విశ్వవిద్యాలయాలనుంచి 400 మందికి పైగా విద్యావేత్తలు జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనకు తమ మద్దతు తెలిపారు. అయితే, జేఎన్‌యూలో జరిగిన ఘటనలపై పూర్తి అవగాహన లేకుండానే విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కన్నయ్యకు మద్దతివ్వడం పట్ల భారతదేశానికి చెందిన కొందరు విద్యార్థులు మండిపడుతున్నారు.

JNU row: Students in California, Yale narrate Kanhaiya Kumar's 'seditious' speech

ఆ ముగ్గురి కోసం లుక్ అవుట్ నోటీసులు

ఢిల్లీ జెఎన్‌యులో గత వారం చోటుచేసుకున్న వివాదానికి సంబంధించి ముగ్గురు యువకుల కోసం పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. వర్శిటీలో జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు వారిపై అభియోగం నమోదైంది.

ఫారిన్ రిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)కు ఢిల్లీపోలీసులు సమాచారం అందించారు. ముగ్గురు యువకులు జెఎన్‌యు విద్యార్థులేనని అనుమానం వ్యక్తచేస్తున్న పోలీసులు వారి ఆచూకీ కోసం ఎయిర్‌పోర్ట్ అధికారులను అప్రమత్తం చేయాల్సిందిగా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓను కోరారు.

ముగ్గురు యువకులు దేశం విడిచివెళ్లిపోకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో ముగ్గురు యువకులకు సంబంధించి శుక్రవారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. జెఎన్‌యులో జరిగిన మొత్తం వివాదానికి ఈ ముగ్గురే సూత్రధారులని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: బీహార్‌లో షాకింగ్: హనుమంతుడికి కోర్టు నోటీసులు

జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చాడన్న ఆరోపణలతో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదృశ్యమైన విద్యార్థుల ఫోన్ నెంబర్లను, కాల్ డేటాను పోలీసులు సేకరించారు. ఇప్పుడానెంబర్లకు ఫోన్ చేస్తుంటే స్విచాఫ్ వస్తోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

దర్యాప్తు అధికారులు ఇప్పటికే 12 మంది జెఎన్‌యు విద్యార్థుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. గొడవలకు కారణమైన వారి ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రత్యేక సెల్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. జెఎన్‌యు వివాదానికి సంబంధించి మొత్తం పది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Coming out in support of JNU students' union president Kanhaiya Kumar, arrested in a sedition case, students and teachers of several international universities, including those from University of California and Yale, are narrating his "seditious" speech in English and uploading their videos online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X