వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీక్రెట్ ఏంటి: అందుకే ప్రధాని మోడీ బాలీవుడ్ కార్యక్రమాలకు హాజరవుతున్నారా..?

|
Google Oneindia TeluguNews

2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి. ఎవరిని బరిలోకి దింపాలి ఎవరు ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుంది అనే లెక్కలు పార్టీలు వేస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రముఖులచే ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ నటీనటులపై ఆసక్తి చూపుతున్నారు. వీరితో ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు.

శబరిమల అయ్యప్పను దర్శించుకున్నది ఇద్దరు కాదు, 51 మంది మహిళలు: కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్పను దర్శించుకున్నది ఇద్దరు కాదు, 51 మంది మహిళలు: కేరళ ప్రభుత్వం

ఎన్నికల వేళ బాలీవుడ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ

ఎన్నికల వేళ బాలీవుడ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ

ఎన్నికల సమయాల్లో సినీ ప్రముఖులు తెగ బిజీ అయిపోతారు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కంటే ప్రజల్లో తెరపై కనిపించే ఈ స్టార్లకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అయితే ఎన్నికళ వేళ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ముంబైలో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు హాజరుకానున్నారు. గత రెండు నెలల్లో ప్రధాని నరేంద్ర మోడీ సినిమాలకు సంబంధించి మూడు పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యారు.

 పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి..?

పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి..?

ఇదిలా ఉంటే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్ స్టార్లతో ప్రచారం చేయించాలనే యోచనతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మోడీ సినిమా కార్యక్రమాలకు వెళుతున్నారంటే దాని వెనక పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉందని వారు చెబుతున్నారు. ఓ వైపు ఓటర్లను ఆకర్షిస్తూనే మరోవైపు నటీనటుల ప్రభావం కూడా ఓటర్లపై పడుతుందనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

మూడునెలల్లో రెండు భారీ బాలీవుడ్ కార్యక్రమాలకు ప్రధాని

మూడునెలల్లో రెండు భారీ బాలీవుడ్ కార్యక్రమాలకు ప్రధాని

గతేడాది డిసెంబర్ 18న బాలీవుడ్ నిర్మాతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ప్రధానిని కలిసిన వారిలో కరణ్ జోహార్, అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, రాకేష్ రోషన్లతో పాటు మరికొందరు నిర్మాతలు కలిశారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 11న మరికొంతమంది బాలీవుడ్ నటీనటులతో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌషల్‌తో పాటు మరికొందరు నటీనటులు ఉన్నారు. మరోవైపు బుధవారం ప్రధాని మోడీ అనిల్ కపూర్‌ను కలవడం విశేషం. అనిల్ కపూర్ ప్రధానితో కలిసిన ఫోటోను ట్వీట్ చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల పుట్టినరోజు సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా ట్విటర్‌పై అభినందనలు కూడా తెలుపుతుంటారు. అనారోగ్యంతో ఉన్న నటులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తుంటారు.

ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై మోడీ నజర్

ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై మోడీ నజర్

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు కొన్ని తాయిలాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని బీజేపీ భావిస్తోంది. అందుకే బాలీవుడ్ నటులను ప్రచారంలోకి దించాలనే యోచనలో ఉంది. ఓటర్లపై ఏదైతే ప్రభావం చూపుతుందో వాటిని అందిపుచ్చుకోవడంలో మోడీ మిగతానాయకులకంటే ముందుంటారు. ఉదాహరణకు సోషల్ మీడియా ఓటర్లను ప్రభావితం చేస్తుందని భావించిన ప్రధాని మోడీ అతను వినియోగించినంతగా మరే నాయకుడు సోషల్ మీడియాను వినియోగించలేకపోయారు. ప్రజల్లో నటులు ఎలాంటి ప్రభావితం చూపుతారో ఊహించిన ప్రధాని మోడీ వారిని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 ప్రియాంకా చోప్రా నిక్ జోనాస్‌ల రిసెప్షన్‌కు ప్రధాని హాజరు

ప్రియాంకా చోప్రా నిక్ జోనాస్‌ల రిసెప్షన్‌కు ప్రధాని హాజరు

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా మాధురీ దీక్షిత్‌ను కలిశారు. సంపర్క్ సమర్థన్ ప్రచారంలో భాగంగా ప్రియాంకా చోప్రా నివాసానికి వెళ్లి అమిత్ షా కలిశారు. మరోవైపు ప్రధాని మోడీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్ , క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మల వివాహం తర్వాత ఏర్పాటు చేసిన ఫంక్షన్‌కు హాజరయ్యారు. సినీనటులు లేదా క్రీడాకారులు ఒక వస్తువుకు సంబంధించి అడ్వర్టయిజ్‌మెంట్ చేశారంటే వారి అభిమానులు అవే వస్తువులు కొంటారు తద్వారా కంపెనీ లాభాల బాట పడుతుంది. రాజకీయాల్లో కూడా ఇదే ఫార్ములాను బీజేపీ వినియోగిస్తోంది. సినీ తారలు, క్రికెటర్లను రంగంలోకి దింపడం ద్వారా తమ అభిమానులు బీజేపీకి ఓటు వేస్తారనే భావనలో ఉంది.

మొత్తనికి సినీ ప్రముఖులకు గాళం వేసి బీజేపీ ప్రచారంలోకి దింపగలిగితే కచ్చితంగా ఓటర్లపై ప్రభావం చూపుతారని తద్వారా బీజేపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
As the countdown to the 2019 Lok Sabha elections begins, the Bharatiya Janata Party (BJP) is looking to tap into as many varied constituencies as it can, and a key element of this is Prime Minister Narendra Modi’s strategic outreach to the Hindi film industry.Saturday’s inauguration of the National Museum of Indian Cinema in Mumbai — expected to be attended by several film personalities — is yet another example of Modi’s emphasis on the film industry ahead of polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X