BS Yediyurappa Resignation :యడ్యూరప్ప రాజీనామా - సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తో భేటీ
కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎట్టకేలకు సీఎం పదవికి రాజీనామా చేశారు. వయసు మీరిన కారణంగా పార్టీ నిబంధనల మేరకు పదవిని వదులుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో కర్నాటక బీజేపీలో నెలకొన్న ప్రతిష్యంభనకు తెరపడినట్లయింది. కాసేపట్లో గవర్నర్ తో భేటీ అయి రాజీనామా సమర్పిస్తారు. ఈ సందర్భంగా తనకు సీఎంగా పనిచేసే అవకాశమిచ్చిన ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాకు యడ్డీ కృతజ్ఢతలు తెలిపారు. అలాగే సేవ చేసే అవకాశమిచ్చిన కర్నాటక ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
కర్నాటక బీజేపీలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తప్పుకోవాలని హైకమాండ్ కోరినా ఆయన తిరస్కరిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రతిష్టంభన నెలకొంది. 75 ఏళ్లు దాటిన వారంతా అధికారిక పదవుల నుంచి తప్పుకోవాలన్న బీజేపీ నిబంధన మేరకు యడియూరప్పను పదవి నుంచి తప్పుకోవాలని అధిష్టానం సూచించింది. అయితే ఆయన లింగాయత్ రాజకీయాల్ని అడ్డుపెట్టుకుని పదవిలో కొనసాగేందుకు ప్రయత్నించారు. అయినా హై కమాండ్ ఒప్పుకోలేదు.

యడియూరప్ప కర్నాటక సీఎం పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించకపోవడంతో పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు చర్చలు జరిపారు. యడియూరప్ప తప్పుకుంటే ఆయన భవిష్యత్తుకు కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో యడియూరప్ప సీఎం పదవిని వదులుకునేందుకు సిద్దమయ్యారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ ను కలిసి అధికారికంగా ఆయన రాజీనామా పత్రం అందజేస్తారు. ఆ తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో బీఎస్ యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నానని, కర్నాటక అభివృద్ధి కోసం చాలా చేశానని చెప్పుకొచ్చారు. 75 ఏళ్లు దాటినా తనకు అధిష్టానం రెండేళ్లు అవకాశం ఇచ్చిందన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాన్నారు. ఈ రెండేళ్లు తనకు అగ్నిపరీక్ష లాంటిదని యడియూరప్ప అన్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ తో పోరాడామని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా ఉండాలని కోరారని, కానీ కర్నాటకకు మాత్రమే పరిమితం అవుతానని చెప్పినట్లు యడియూరప్ప గుర్తు చేసుకున్నారు. మధ్యాహ్నం గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పిస్తానన్నారు.
-
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications