బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో విడుదల, రైతు రుణాలు, ఫ్రీ ల్యాప్ టాప్ లు, ఉద్యోగాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. బెంగళూరు నగరంలోని రెడిసన్ బ్లూ హోటల్ లో శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్. యడ్యూరప్ప విడుదల చేసి వరాలు కురిపించారు. జయనగర ఎమ్మెల్యే విజయ్ కుమార్ హఠాన్మరనానికి బీజేపీ నాయకులు శ్రధ్దాంజలి ఘటించి అనంతరం ఎన్నికల మేని ఫెస్టోను విడుదల చేశారు. రైతుల రుణమాఫీలు, విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు, మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్, నిరుద్యోగులకు ఉద్యోడాలు ఇస్తామని హామీలు ఇచ్చారు.

Karnataka assembly elections 2018: BJP Manifesto released in Bengaluru.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హైలెట్స్

* స్వయం ఉద్యోగం, ఉద్యోగ సృష్టి పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఉత్తమ ఉద్యోగం కల్పించడం.
* రాష్ట్రంలో 60 నమ్మ బీపీఓ సంస్థలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడానికి పారిశ్రామికవేత్తలకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం.
* ముఖ్యమంత్రి ల్యాప్ టాప్ పథకంలో భాగంగా కాలేజ్ లో చేరిన ప్రతి విద్యార్థికి ఉచిత ల్యాప్ టాప్ లు మంజూరు.
* బెంగళూరు, మైసూరు, మంగళూరు, రాయచూరు, హుబ్బళి, కలబురగిలో స్టార్స్ ఆప్ కంపెనీలు స్థాపించడానికి భూములు మంజూరు చేసి ఇతర సౌకర్యాలు కల్పించడం.
* ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో క్రీడలు ప్రోత్సహించడానికి రూ. 100 కోట్లు మంజూరు.
* బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మంత్రి మండలి సమావేశంలో జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో రైతులకు ఉన్న రూ. 1 లక్ష వరకు రుణాలు మాఫీ చెయ్యాలని తీర్మాణం.
* కనీస మద్దతు ధర కంటే రైతులకు, చిరు వ్యాపారులకు 1.5 శాతం అధిక ధర ఇవ్వడం.
* ధరలు వ్యత్యాసం వచ్చిన సందర్బంలో రైతులను ఆదుకోవడానికి రూ. 5,000 కోట్లతో రైతు బంధు అర్హత నిధి పథకం.
* భూమి లేని వ్యవసాయ కార్మికుల కోసం ముఖ్యమంత్రి రైతు సురక్షా భీమా పథకంలో ఉచితంగా రూ. 2 లక్షలు ప్రమాధ భీమా మంజూరు.
* రాష్ట్రంలోని అన్ని జలాశయాల పనులు 2023లోపు పూర్తి చెయ్యడానికి రూ. 1. 5 లక్షల కోట్లు మంజూరు.
* రాష్ట్రంలోని అన్ని చెరువులు పూడికలు తీసి శ్రభ్రం చెయ్యడానికి మిషన్ కళ్యాణి పథకం.
* రైతుల పంప్ సెట్లకు ప్రతి రోజు 10 గంటల పాటు త్రీఫేస్ విద్యుత్ సరఫరా.
* వ్యవసాయ విభాగంలో శిక్షణ తీసుకుంటున్న రైతుల బిడ్డల కోసం రూ. 100 కోట్లతో రైతు బంధు విద్యార్థి వేతనాలు మంజూరు.
* ముఖ్యమంత్రి వ్యవసాయ ఫిలోషిఫ్ పథకంలో భాగంగా సాంకేతిక పద్దతితో వ్యవసాయం చెయ్యడానికి ప్రతి సంవత్సరం 1,000 రైతులను చైనా, ఇజ్రాయిల్ పంపించి శిక్షణ ఇప్పించడం.
* కేఎంఎఫ్ ద్వారా పండ్లు, కూరగాయాల ఉత్పత్తి కోసం రూ. 3,000 కోట్లు నిధి.
* పశు పరిశోధన కేంద్రాలకు అవసరమైన కేంద్రాలు స్థాపించడానికి రూ. 3,000 కోట్లతో కామధేను పథకం.
* గ్రామీణ ప్రదేశాల్లో పశువులు, ఇతర ప్రాణులకు ఉచిత చికిత్స చేయించడానికి కేఎంఎఫ్ ద్వారా రూ. 1,000 కోట్ల నిధులు.
బీజేపీ తన మేనిఫెస్టోలో ఎక్కువగా రైతులు, యువత, నిరుద్యోగులు, కాలేజ్ విద్యార్థులకు వరాలు కురుపించింది.

English summary
Karnataka assembly elections 2018: BJP Manifesto released in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X