సీఎం సిద్దరామయ్యకు చాముండేశ్వరీలో ఎదురు దెబ్బ, బాదామిలో శ్రీరాములుతో నువ్వానేనా, ఢీ!
Recommended Video

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సిద్దరామయ్య మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో ప్రత్యర్థి, స్థానిక జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ దెబ్బకు వెనకబడిపోయారు.

శ్రీరాములుతో ఢీ
బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గంలో బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములుకు సీఎం సిద్దరామయ్య గట్టిపోటీ ఇస్తున్నారు. బాదామి శాసన సభ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య, బి. శ్రీరాములు నువ్వానేనా అంటు ఓట్ల లెక్కింపులో పోటీపడుతున్నారు.

సీఎం సిద్దూకు సినిమా
మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు 5వ రౌండ్ లో 12,960 ఓట్లు వచ్చాయి. సీఎం సిద్దరామయ్య మీద పోటీ చేసిన స్థానిక ఎమ్మెల్యే, జేడీఎస్ అభ్యర్థి జీటీ. దేవేగౌడకు 17,356 ఓట్లు వచ్చాయి. చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య వెనకబడిపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

బాదామిలో సీఎం సిద్దూ
బాదామి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రజలు అంచనా వెయ్యలేకపోతున్నారు.

జేడీఎస్ ధీమా
కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అంటూ పోటీ పడుతుండంతో ఇటు జేడీఎస్ మాత్రం మేములేకుండా మీరెవ్వరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని అంటోంది. కర్ణాటకలో ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా జేడీఎస్ పార్టీ కీలకంగా మారనుంది.

సీఎం ఓడిపోతారు
చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో అందరూ అనుకున్నట్లే సీఎం సిద్దరామయ్య ఓడిపోతారని సమాచారం. స్థానిక ఎమ్మెల్యే, జేడీఎస్ నాయకుడు జీటీ. దేవేగౌడ సీఎం సిద్దరామయ్యకు సినిమా చూపిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య స్థానిక ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications