విజయకాంత్‌కు నో!: అళగిరిపై కరుణ ఆగ్రహం, సస్పెన్షన్

చెన్నై: డిఎంకె పార్టీలో సంక్షోభం ముదిరింది. కుటుంబం, పార్టీ విభేదాలు రచ్చకెక్కాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు కరుణానిధి తన తనయుడు అళగిరిని పార్టీలో నుండి, పార్టీ పదవుల నుండి శుక్రవారం సస్పెండ్ చేశారు. గత కొంతకాలంగా అళగిరి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.

గత వారం అళగిరిని, ఆయన అనుచరులను కరుణానిధి తీవ్రంగా హెచ్చరించారు. అయినా సద్దుమణగలేదు. దీంతో ఈ రోజు పార్టీలోన్ని అన్ని పదవుల నుండి అళగిరిని బహిష్కరించారు. డిఎంకె పార్టీ విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అళగిరి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

karunanidhi and alagiri

డిఎంకెలో కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో కరుణానిధి కుమారులు అళగిరి, స్టాలిన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. కరుణానిధి, స్టాలిన్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా డిఎండికెతో పొత్తును అళగిరి వర్గం వ్యతిరేకిస్తోంది. కాగా, కరుణానిధి ఏకంగా తన తనయుడినే పార్టీ పదవుల నుండి బహిష్కరించడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+