వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రంట్‌కు సపోర్ట్ చేయండి : నాన్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి, స్టాలిన్‌తో కేసీఆర్

|
Google Oneindia TeluguNews

చెన్నై : ఫెడరల్ ఫ్రంట్ కోసం వడివడిగా అడుగులేస్తున్నారు సీఎం కేసీఆర్. రెండో విడత కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసిన కేసీఆర్ .. ఇవాళ డీఎంకే చీఫ్ స్టాలిన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్, డీఎంకే ఎంపీలు దురైమురుగన్, టీఆర్ బాలు పాల్గొన్నారు.

స్టాలిన్ తో భేటీ ..

స్టాలిన్ తో భేటీ ..

ఆదివారం రాత్రి శ్రీరంగం వెళ్లిన కేసీఆర్ .. రంగనాథస్వామి, తిరుచ్చిలో స్వామివార్లను దర్శించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం తన బృందంతో చెన్నై చేరుకున్నారు. ఆళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసానికి రాగా ... ఆయన సాదర స్వాగతం పలికారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ బలోపేతానికి సహకరించాలని స్టాలన్ ను సీఎం కేసీఆర్ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ప్భుత్వం ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్టాలిన్ తో భేటీ .. ఫ్రంట్ ఆవశ్యకతపై చర్చించారు.

10 రోజుల్లో ఫలితాలు ..

10 రోజుల్లో ఫలితాలు ..

మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలోనే సమాఖ్య కూటమి కోసం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న డీఎంకే కూడా కేసీఆర్ కు మద్దతు తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాంతీయ పార్టీల అవసరాలను తెలిపి .. మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

కూటమికి మద్దతు

కూటమికి మద్దతు

ఇప్పటికే నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, మాయావతితో వారి నివాసాలకు వెళ్లి మరీ కేసీఆర్ చర్చలు జరిపారు. ఫ్రంట్ ఏర్పాటు వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే అఖిలేశ్ యాదవ్ తో భేటీ కానీ కేసీఆర్ .. ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. ఇటు వైసీపీ అధినేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై .. డిస్కస్ చేశారు. రెండో విడత పినరయి విజయన్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. పినరయి కూడా కూటమికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. స్టాలిన్ మద్దతుతో ఫ్రంట్ ఏర్పాటు అడుగుదూరంలో ఉందనే వాదన వినిపిస్తోంది.

English summary
The second phase of the Federal Front for drifting to Kerala Chief Minister P. Vijayan met KCR .. today with DMK Chief Stalin. TRS MPs Vinod, Santosh and DMK MPs Duraimurugan and TR Ball participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X