వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డ్రెస్ మార్చుకొంటుంటే డోర్ వేయొద్దు, హోమో సెక్సువల్స్ గా మారుతారంటూ ఇలా..'..

By Narsimha
|
Google Oneindia TeluguNews

కొల్లం:కళాశాల యాజమాన్యం , సిబ్బంది అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ నర్సింగ్ కాలేజీ విధ్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది. కళాశాల ప్రిన్సిపాల్ కూడ తక్కువేమీ కాదని విధ్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కేరళలోని ఉపాసన నర్సింగ్ కళాశాల విధ్యార్థినులు నిరసన బాట పట్టారు. తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.అంతేకాదు తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తున్నారు.

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విధ్యార్థినులు సోమవారం రాత్రి నుండి కళాశాల క్యాంపస్ బయటే విధ్యార్థినులు ఆందోళనకు దిగారు.

Kerala nursing students protest alleging misogyny, mistreatment

కొంత కాలంగా కళాశాల మేనేజ్ మెంట్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విధ్యార్థినులు ఆరోపించారు. తాము దుస్తులు మార్చుకొనే సమయంలో తలుపులు వేయకూడదని ఆదేశించారని చెప్పారు.

హోమో సెక్సువల్ యాక్టివిటీస్ కు పాల్పడే అవకాశం ఉందని చెబుతూ ఈ ఆదేశాలు ఇచ్చారని విధ్యార్థినులు చెప్పారు.గ్రంథాలయంలోని ఇంటర్నెట్ ను ఉపయోగించుకోకుండా అడ్డుకొంటున్నారని చెప్పారు.అయితే తాము ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని ఫోర్న్ సైట్లను చూస్తామని చెబుతున్నారని చెప్పారు.

నిమ్నకులాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారని, భారీ జరిమానాలు విధిస్తున్నారని విధ్యార్థినులుఆరోపించారు.ఈ కాలేజీ వారం రోజుల నుండి మూసివేశారు.

English summary
The students of Upasana College of Nursing on Tuesday staged a protest in Kerala's Kollam district against alleged mistreatment and misogynistic statements by college authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X