వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఎఫెక్ట్, విపక్షాలు ఒక్కటిగా..: లాలూ, నితీష్ దోస్తీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి! ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లో మోడీ హవా కనిపించిన విషయం తెలిసిందే. బిజెపి దాటికి అధికార జెడియు, ప్రతిపక్ష ఆర్జెడీలు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో బిజెపి హవాను అడ్డుకోవడమే లక్ష్యంగా జెడియు ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు లాలు ప్రసాద్ యాదవ్ చెప్పారు.

కానీ, భవిష్యత్తులో ఆ పార్టీతో బంధంపై మాత్రం స్పందించ లేదు. అంతేగాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఢిల్లీలో లాలు గురువారం సాయంత్రం కలిశారు. బీహార్ ఎన్నికల్లో పరాభవానికి గల కారణాలపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. మత శక్తులకు చెక్ పెట్టేందుకే చాలాకాలంగా కాంగ్రెస్‌కు మద్దతిస్తూ వచ్చామని, ఇప్పుడు త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో బిజెపికి చెక్ పెట్టేందుకు జతిన్ రామ్ మాంఝీ సర్కారుకు మద్దతిస్తున్నామని లాలు తెలిపారు.

Lalu Prasad Yadav backs Nitish to keep BJP at bay

బీహార్‌లో బిజెపి అత్యధిక స్థానాలు గెలిచిన నేపథ్యంలో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. జతిన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో మాంఝీ నేతృత్వాన కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి మద్దతు తెలుపనున్నట్టు ప్రతిపక్ష ఆర్‌జెడి (రాష్ట్రీయ జనతాదళ్) గురువారం ప్రకటించింది.

ఆర్జేడీ శాసనసభా పక్ష నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ పాట్నాలో ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న జెడియు కొత్త మంత్రివర్గానికి ఈ ప్రకటన ఎంతో బలాన్నిచ్చింది. కొత్త ముఖ్యమంత్రిగా మాంఝీని నామినేట్ చేసిన తర్వాత విశ్వాస ఓటును పొందేందుకు శుక్రవారం శాసనసభను ప్రత్యేకంగా సమావేశపర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జెడియు ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే విషయం ఆర్జేడీ మద్దతుపై ఆధారపడి లేకపోయినప్పటికీ మహాదళిత సామాజిక వర్గానికి చెందిన మంఝీకి మద్దతు తెలపాలని నిశ్చయించుకున్నామని సిద్ధిఖీ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆర్జేడీ పోరాడుతోందని, అందుకే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

English summary
In a major political strategy aimed at arresting the BJP’s march in Bihar and beyond, the Lalu Prasad Yadav-led RJD on Thursday indicated a partnership with its arch-rival, the ruling JD(U) of former CM Nitish Kumar, by announcing that RJD MLAs will support the JD(U) government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X