• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుక్క, కరుణానిధి జుత్తు, స్లీవ్ లెస్: జయ గురించి ఆసక్తికర విషయాలు

|

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత సోమవారం రాత్రి గం.11.30కు మృతి చెందారు. జయలలిత రాజకీయాల్లో ఓ సంచలనం. 32 ఏళ్ల తర్వాత తమిళ రాజకీయాల్లో వరుసగా రెండోసారి ఓ పార్టీని గెలిపించడం ద్వారా, రెండోసారి సీఎం అయ్యారు. రాజకీయాలతో పాటు ఆమె గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

కుక్కలు అంటే ఇష్టం

కుక్కలు అంటే ఇష్టం

జయలలితకు కుక్కలు అంటే చాలా ఇష్టం. అయితే తనకు చాలా ఇష్టమైన పెంపుడు కుక్క జూలీ 1998లో మృతి చెందింది. అప్పటి నుంచి వాటికి దూరంగా ఉన్నారు. జయ జీవితంలో జూలికి ప్రత్యేక స్థానం ఉంది. జయ.. ఎన్డీయేలో ఉన్నప్పుడు సమావేశం జరుగుతుండగా మధ్యలో వెళ్లిపోయారు. దీనిపై రాజకీయ ప్రచారం జరిగింది. కానీ జూలీ చనిపోయిన విషయం తెలిసి ఆమె మధ్యలో వచ్చేసినట్లుగా ఆ తర్వాత తెలిసింది. నేను ఎక్కడకు వెళ్లినా జూలీ తనతోనే ఉంటుందని ఓసారి అన్నారు. ఆమెకు పెట్స్ మీద ఉన్న అభిమానం చూసిన సన్నిహితులు మరో దానిని పెంచుకోవాలని సూచించారు. దానిని జయలలిత తిరస్కరించారు.

ఎప్పుడూ తమిళియన్‌గా..

ఎప్పుడూ తమిళియన్‌గా..

ఎప్పుడు తమిళియన్‌గా ఉండేందుకు ఇష్టపడేవారు. దశాబ్దాల క్రితం.. మైసూరులోని చాముండి స్టూడియోలో ఓ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో కొందరు గ్రూప్‌గా వచ్చారు. జయలలిత తనను తమిళియన్‌గా చెప్పుకోవడాన్ని నిరసిస్తూ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ జయలలిత తగ్గలేదు. ఈ విషయమై అప్పటి జయలలిత పీఆర్వో (ఫిల్మ్ న్యూస్) ఆనందన్ మాట్లాడుతూ.. నేను తప్పుగా మాట్లాడలేదని, అలాంటప్పుడు నేను క్షమాపణ ఎందుకు చెప్పాలని అడిగారు. తాను కచ్చితంగా తమిళియన్‌నే అని, కన్నడ వ్యక్తిని కాదని చెప్పారని అన్నారు.

సెన్సాప్ హ్యూమర్

సెన్సాప్ హ్యూమర్

జయలలితకు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. గత దశాబ్దంలో.. అన్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ బాలగురుసామి.. జయలలితను కలిశారు. ఆ సమయంలో ఆయన హెయిర్ స్టయిల్ చూశారు. దాని గురించి అడిగారు. అప్పుడు బాలగురుసామి మాట్లాడుతూ.. 'మేడం, నా హెయిల్ స్టయిల్ గురించి చెబుతాను. కానీ మీరు ఆగ్రహం తెచ్చుకోవద్దు' అన్నారు. దానికి జయలలిత.. సరే చెప్పు అన్నారు.

అప్పుడు వైస్ ఛాన్సులర్ బాలగురు స్వామి తన హెయిర్ స్టయిల్ గురించి చెప్పారు. డిఎంకే అధినేత కరుణానిధి నుంచి తాను ప్రేరణ పొందినట్లు చెప్పారు. అప్పుడు జయలలిత స్పందిస్తూ.. అసలు కరుణానిధికి హెయిర్ లేదు కదా అన్నారు. దానికి బాలగురు స్వామి.. 1960లలోని అతని హెయిర్ స్టయిల్ కాపీ కొట్టానని చెప్పారు. ఆ సమయంలో జయ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

స్లీవ్ లెస్ ధరించిన..

స్లీవ్ లెస్ ధరించిన..

మాజీ భారత రాష్ట్రపతి పీవీ గిరి తనయుడు శ్రీ శంకర్ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన ఎపిస్టిల్ అనే ఆంగ్ల లఘుచిత్రంలో జయలలిత నటించారు. తల్లి బలవంతం పైన చిన్న వయస్సులోనే సినీ రంగంలోకి వచ్చారు. ఇజ్జత్ అనే హిందీ సినిమాలో నటించారు. తమిళ సినిమా పాటలో స్లీవ్ లెస్ జాకెట్ ధరించి, జలపాతంలో తడిసిన తొలి తారగా రికార్డ్ నెలకొల్పారు.

జయలలిత 85 చిత్రాల్లో నటించగా, 80 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో 25 చిత్రాల్లో నటించారు. తన దగ్గర తోట పని చేసే యువకుడిని చేరదీసి ఉన్నత చదువులు చదివించారు జయలలిత. ఏడేళ్ల క్రితం వచ్చిన వార్తల ప్రకారం అతను పెద్దవాడై అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడు.

English summary
A dog lover, Jayalalithaa stopped keeping them as pets after her favourite dog Julie, a Spitz, died in 1998.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X