ఆర్ కె నగర్ ఉప ఎన్నిక: మధుసూదన్ ను బరిలోకి దింపిన పస్నీర్ సెల్వం, దినకరన్ కు చెక్?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:ఏప్రిల్ 12వ, తేదిన జరిగే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ వర్గం తరపున మధుసూదన్ ను బరిలోకి దించుతున్నట్టుగా మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఈ స్థానం నుండి విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.

Madhusudhanan is our candidate in Rk nagar assembly by poll:panneer

అన్నాడిఎంకె తమ అభ్యర్థిగా దినకరన్ ను బరిలోకి దింపింది. ఈ మేరకు బుదవారం నాడు ఆ పార్టీ దినకరన్ పేరును ప్రకటించింది. మరో వైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన వర్గం నుండి అన్నాడిఎంకె ప్రిసీడియం చైర్మెన్ గా పనిచేసిన మధుసూదన్ ను బరిలోకి దించుతోంది.

మధుసూదన్ ను తమ పార్టీ అభ్యర్థిగా ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఉప ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నట్టుగా గురువారం నాడు పన్నీర్ సెల్వం ప్రకటించారు.అయితే అన్నాడిఎంకె పార్టీని ఈ ఉప ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలతో డిఎంకె కూడ వ్యూహ రచన చేస్తోంది.మరో వైపు తమతో కలిసివచ్చే శక్తులతో కలుపుకోవాలనే ఉద్దేశ్యంతో డిఎంకె ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The bypoll battle for R K Nagar constituency just heated up with OPanneerselvam announcing Madhusudhanan as their candidate. The former Presidium chairman of the AIADMK is pitted against current deputy general secretary TTV Dinakaran.
Please Wait while comments are loading...