వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

28సార్లు దండయాత్ర: టెన్త్ పాసైన సిఎం ఆఫీస్ ప్యూన్

|
Google Oneindia TeluguNews

ముంబై: ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ప్యూన్‌గా పని చేస్తున్నారు. 50ఏళ్ల ఆయనకు పదవ ఉత్తీర్ణత సాధించాలనేది ప్రగాఢ కోరిక. దీంతో ఆయన పదవ తరగతి పరీక్షలు పాసయ్యేందుకు భగీరథ ప్రయత్నమే చేశారు. ఏకంగా 28సార్లు పరీక్షలు రాసి మొత్తానికి ఉత్తీర్ణత సాధించారు.

ఆయనే మంత్రాలయ ఉద్యోగి అవినాశ్ చౌగలే. ప్రస్తుతం ఆయన కార్యాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో లేటు వయస్సులోనైనా ఎంతో కష్టపడి పదవ తరగతి పాసైన చౌగలేను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సత్కరించారు.

devendra fadnavis

‘మా ఉద్యోగికి శుభాకాంక్షలు.. 50ఏళ్ల వయస్సులో అవినాశ్ చౌగలే 10వ తరగతి పాసయ్యారు' అని దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చౌగలేను అభినందించాలని ఆయన కోరారు. అంతేగాక, చౌగలేతో ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


ముంబైలో తన తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, భార్య, కొడుకుతోపాటు జీవిస్తున్న చౌగలే 1987లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. కాగా, ముఖ్యమంత్రి మెచ్చుకోవడమే కాకుండా, సంబరాలు చేయడం పట్ల చౌగలే ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

గణితం చాలా కష్టమని, ఇప్పుడు తాను పదవ తరగతి పరీక్షలు పాసైనందుకు చాలా సంతోషంగా ఉందని చౌగలే చెప్పారు. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయి ఏం చేస్తావని.. తన స్నేహితులనే వారని, కానీ పట్టుదలతో పాసయ్యానని తెలిపారు. 9రోజుల ముందే అతనికి యాభై ఏళ్లు వచ్చాయి. కాగా, సోమవారం 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

English summary
A peon from Maharashtra Chief Minister Devendra Fadnavis' office finally cleared his SSC Board examinations (Class 10) after 28 attempts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X