హిందూ దేవాలయంలో 30 బాంబులు : భారీ ఉగ్ర కుట్రకు ఇంటెలిజెన్స్ చెక్

Subscribe to Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ : మొన్న హైదరాబాద్.. నేడు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్.. దేశంపై ఏ క్షణంలోనైనా ఉగ్ర చర్యతో విరుచుకుపడాలని చూస్తోన్న ఉగ్రవాదులు తాజాగా ఉత్తరప్రదేశ్ ను టార్గెట్ చేశారు. భారీ భీభత్సానికి కుట్ర పన్నిన ముష్కరులు ప్రతాప్ గఢ్ లోని ఓ హిందూ దేవాలయంలో ఏకంగా 30 బాంబులను పెట్టడం సంచలనంగా మారింది.

అయితే అప్రమత్తమైన ఇంటలిజెన్స్ చర్యలతో ఈ భారీ ఉగ్ర కుట్రకు చెక్ పడింది. హిందూ దేవాలయంలో బాంబులు పెట్టారన్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. ఏ క్షణాన అయినా బాంబులు పేల్చేందుకు సిద్దమవుతున్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో పిస్టళ్లు, కాట్రిడ్జ్ లతో పాటు ఆలయంలో పెట్టిన 30 బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Major terror attack averted? 30 live bombs recovered from temple in UP's Pratapgarh; 2 arrested

కాగా, ఆలయంలో బాంబులు పెట్టిన ఉగ్రవాదులు.. వాటిని పేల్చే క్షణం కోసం కాచుకు కూర్చున్నారు. ఇంతలోనే విషయం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కు చేరడంతో, రంగంలొకి ఇంటెలిజెన్స్ పోలీస్ ముష్కర దాడికి అడ్డుకట్టవేశారు. దీంతో దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమం కాగా, ఉగ్రవాద తాజా కుట్ర నేపథ్యంలో దేశంలొ భద్రతను మరింత అప్రమత్తం చేయనున్నట్లుగా సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a major development, two persons were arrested from a temple in Pratapgarh district of Uttar Pradesh on Thursday.The two were arrested with cache of arms including 30 live bombs, pistols and cartridges.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి