షాక్: భర్తపై ఇష్టం లేక, ప్రియుడి కోసం గ్యాంగ్‌రేప్ నాటకం, ఏమైందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: ప్రియుడి మోజులో భర్తను వదిలించుకొనేందుకు వివాహిత గ్యాంగ్ రేప్ నాటకమాడింది. అయితే పోలీసులు ఈ నాటకానికి తెరదించారు. గ్యాంగ్ రేప్ నాటకమాడితే భర్త తనను వదిలించుకొంటాడని ఈ పథకాన్ని వేసినట్టు వివాహిత పోలీసుల విచారణలో తెలిపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

దారుణం: తల్లి ప్రోత్సాహం, మైనర్ బాలికపై తండ్రి ఐదేళ్ళుగా లైంగికదాడి

వివాహేతర సంబంధం: రెండోసారి వచ్చి హత్యకు గురయ్యాడు

ప్రియుళ్ళ మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహ ఘటనలు దేశ వ్యాప్తంగా కూడ లేకపోలేదు.

మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, టెక్కీ నాగరాజు హత్య, కాల్ డేటా పట్టించింది

అయితే ఇదే తరహ ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. అయితే ఈ ఘటనలో భర్తను మాత్రం హత్య చేయలేదు. కానీ, భర్తను వదిలించుకొనే ప్రయత్నం మాత్రం భార్య చేసింది.

ప్రియుడి మోజులో గ్యాంగ్ రేప్ నాటకం

ప్రియుడి మోజులో గ్యాంగ్ రేప్ నాటకం


కర్ణాటక రాష్ట్రంలోని బ్యాటరాయనపురలో జనవరి 5వ, తేదిన గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ప్రియుడి మోజులో గ్యాంగ్ రేప్ నాటకాన్ని వివాహిత ఆడిందని పోలీసులు ఎట్టకేలకు తేల్చారు. భాధితురాలు చెప్పిన సమాచారానికి పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే భాధితురాలు అసలు విషయాన్ని బయటపెట్టింది. ప్రియుడి కోసం తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని తప్పుడు కేసు పెట్టినట్టు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చింది.

భర్తపై ఇష్టం లేక

భర్తపై ఇష్టం లేక

గ్యాంగ్ రేప్ నాటకమాడిన వివాహితకు ఏడాదిన్నర క్రితం ఓ యువకుడితో వివాహమైంది. అయితే వివాహనికి ముందే ఆమె తమ బంధువులకు చెందిన ఓ యువకుడితో ప్రేమను కొనసాగిస్తోంది. అయితే ఈ ప్రేమ వ్యవహరాన్ని కొనసాగిస్తోంది. అయితే భర్తను వదిలించుకొని ప్రియుడిని రెండో వివాహం చేసుకోవాలని ఆమె ప్లాన్ చేసింది.

గ్యాంగ్ రేప్ నాటకం

గ్యాంగ్ రేప్ నాటకం

జనవరి 5వ, తేదిన బజారుకు వెళ్ళిన తనను కొందరు వ్యక్తులు వ్యానులో తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వివాహిత కట్టుకథ అల్లింది. ఈ కట్టుకథ ప్రకారంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. కానీ ఎక్కడ కూడ గ్యాంర్ రేప్ ఘటనకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదు.

పోలీసుల అనుమానం

పోలీసుల అనుమానం

విచారణలో వివాహిత పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే ఈ విషయమై పోలీసులు వివాహితను గట్టిగా ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. ప్రియుడిని వివాహం చేసుకొనేందుకు గ్యాంగ్ రేప్ నాటకమాడినట్టు ఆమె చెప్పింది. గ్యాంగ్ రేప్ జరిగిందని తెలిస్తే భర్త వదిలేస్తాడని భావించింది. అప్పుడు ప్రియుడిని రెండో పెళ్ళి చేసుకోవచ్చని ప్లాన్ చేశానని ఆమె చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Married woman planned gang rape drama to marry her lover in karnataka . After the enquiry the police found that the gang rape was not done.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X