మైనింగ్ కింగ్ శేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరు: నోరు విప్పితే పళనిసామి ఫినిష్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ కాంట్రాక్టర్, తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి చెన్నైలోని ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నియమాలు ఉల్లంఘించి ప్రవర్థిస్తే బెయిల్ రద్దు చేస్తామని ప్రత్యేక కోర్టు హెచ్చరించింది.

ఆదాయానికి మంచి అక్రమాస్తులు సంపాదించారని తెలుసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు చెన్నైలోని శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు, బంధువులు, స్నేహితుల ఇళ్ల మీద ఏకకాలంలో దాడులు చేశారు.

కోట్ల విలువైన రూ. 2,000 నోట్ల

కోట్ల విలువైన రూ. 2,000 నోట్ల

పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత జరిగిన ఐటీ అధికారులు దాడుల్లో శేఖర్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయాల అక్రమాస్తులు బయటపడ్డాయి. అంతే కాకుండా కొత్త రూ. 2,000 నోట్లు, కొత్త రూ. 500 నోట్లు భారీ మొత్తంలో శేఖర్ రెడ్డి ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు.

అందరూ అరెస్టు

అందరూ అరెస్టు

శేఖర్ రెడ్డితో పాటు పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి శేఖర్ రెడ్డి బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అయితే శేఖర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని అధికారులు కోర్టులో మనవి చేస్తూ వచ్చారు.

తెర మీదకు డైరీ వచ్చింది

తెర మీదకు డైరీ వచ్చింది

ఇదే సమయంలో శేఖర్ రెడ్డి ఇంటిలో స్వాధీనం చేసుకున్న డైరీ విషయం వెలుగు చూసింది. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే సమయంలో తనకు సహకరించిన 12 మంది మంత్రులకు ప్రతిఫలంగా శేఖర్ రెడ్డి ముడుపులు చెల్లించారని వెలుగు చూసింది

లంచం లెక్క రూ. 300 కోట్లు

లంచం లెక్క రూ. 300 కోట్లు

12 మంది మంత్రులతో పాటు 12 మంది ఐపీఎస్ అధికారులు, 14 మంది ఐఏఎస్ అధికారులకు శేఖర్ రెడ్డి రూ. 300 కోట్లు లంచంగా ఇచ్చాడని, వారి మీద చర్యలు తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారని వెలుగు చూసింది.

చివరికి బెయిల్ వచ్చింది

చివరికి బెయిల్ వచ్చింది

ఈ సందర్బంలోనే శేఖర్ రెడ్డి మరోసారి బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శుక్రవారం చెన్నైలోని ప్రత్యేక కోర్టు శేఖర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో శేఖర్ రెడ్డి సన్నిహితులు ఇద్దరికి బెయిల్ మంజూరు అయ్యింది.

విదేశాలు అంటే అదే గతి

విదేశాలు అంటే అదే గతి

దేశం విడిచి వెళ్లకూడదని, విచారణకు అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని, సాక్షాలు తారుమారు చెయ్యడానికి ప్రయత్నించరాదని, సాక్షులను బెదిరించరాదని తదితర షరతులతో శేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి కోర్టు జామీను మంజూరు చేసింది.

నోరు విప్పితే పళనిసామి ప్రభుత్వం ఫినిష్

నోరు విప్పితే పళనిసామి ప్రభుత్వం ఫినిష్

ఇప్పుడు శేఖర్ రెడ్డి బెయిల్ మీద బయటకు రావడంతో ఆయన ఎంత మంది మంత్రుల భాగోతం బయటపెడుతారో ? అంటూ అన్నాడీఎంకే నేతలు హడలిపోతున్నారు. అదే విధంగా సీనియర్ ఐఏఎస్; ఐపీఎస్ అధికారులు హడలిపోతున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇసుక వ్యాపారం చేసే శేఖర్ రెడ్డి కొన్ని వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాధించారని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sekar reddy got conditional bail on the case filed by DA. Sekar reddy'e two friends also got conditional bail.
Please Wait while comments are loading...