'మిస్డ్ కాల్' ఇచ్చిన షాక్: వెంటాడాడు.. ఇంటికి వచ్చి మరీ 'రేప్'యత్నం..

Subscribe to Oneindia Telugu

కృష్ణరాజపుర: కన్ఫ్యూజన్ లోనో.. పొరపాటునో కొన్నిసార్లు ఫోన్ కాల్ అపరిచితులకు కావడం కనెక్ట్ మామూలే. ఒకవేళ అవతలి వ్యక్తులు 'కాల్ నాగులు' అయితే మాత్రం ఎక్కడ లేని తిప్పలు తప్పవు. కొన్నిసార్లు మాన ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం.

తాజాగా బెంగుళూరులోని రామ్మూర్తి నగర్ కు చెందిన ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. బెంగుళూరులోని కృష్ణరాజపుర పరిధిలో ఉన్న రామ్మూర్తి నగర్ లో ఓ మహిళ కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఇటీవల తన బంధువులకు ఫోన్ కాల్ చేస్తున్న సందర్బంలో.. పొరపాటున అది రాజరాజేశ్వరి నగర్ కు చెందిన రోహిత్ అనే వ్యక్తికి కనెక్ట్ అయింది.

missed call leads to rape attemt on woman

ఇక అప్పటినుంచి మహిళకు వేధింపులు మొదలయ్యాయి. పొరపాటున కాల్ వచ్చిందని ఎంత మొత్తుకున్నా అతగాడు వినిపించుకోలేదు. ఆమె గొంతుకు ఆకర్షితుడై.. తరుచూ ఫోన్ చేసి ఆమెను విసిగించడం మొదలుపెట్టాడు. అసభ్యకర మెసేజ్ లు పంపించాడు. ఈ క్రమంలో అనేకసార్లు సదరు మహిళ అతన్ని హెచ్చరించినా.. లాభం లేకుండా పోయింది. పైగా అతను మరింతగా రెచ్చిపోవడం మొదలుపెట్టాడు.

ఏకంగా మొబైల్ నంబర్ ఆధారంగా మహిళ ఉంటున్న ఇంటి చిరునామా కనుక్కొన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కృష్ణరాజపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడి కోసం గాలించిన పోలీసులు బుధవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Bengaluru woman was mistakenly dialed a wrong number and it connected to a unknown person. After the realization she said sorry, but he started to harass her
Please Wait while comments are loading...