గర్ల్స్ హాస్టల్‌లో పేద్ద బల్లి: హడలిపోయిన యువతులు
Recommended Video

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కనిపించిన ఓ భారీ బల్లి కలకలం సృష్టించింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఓ విద్యార్థిని ఆ బల్లిని చూసి ఒక్కసారే గావుకేక పెట్టింది. ఏం జరిగిందోనన్న కంగారుతో లేడీస్ హాస్టల్‌లోని విద్యార్థునులంతా పరుగున వచ్చారు.
అంతకుముందెన్నడూ చూడనంత పెద్ద బల్లిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే కాలేజీ యాజమాన్యానికి కబురుపెట్టారు. నిమిషాల వ్యవధిలోనే వణ్యప్రాణి సంరక్షకులు వచ్చారు. అది ఆఫ్రికా జాతికి చెందిన విషపూరిత బల్లిగా గుర్తించారు.. జాగ్రత్తగా మత్తుమందు ఎక్కించి, దాన్ని తీసుకెళ్లారు.

ఆఫ్రికా జాతికి చెందిన ఆ విషపూరిత బల్లి కుడితే.. ప్రాణాపాయం ఉండనప్పటికీ తీవ్రమైన అనారోగ్యం, విపరీతమైన నొప్పి కలుగుతాయని వణ్యప్రాణి సంరక్షకులు వివరించారు.
ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నేతాజీ సుభాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఎస్‌ఐటీ)లో మే 16న ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన చెట్ల మధ్యలో క్యాంపస్ ఉన్నప్పటికీ.. ఇలాంటి జీవిని ఇదివరకెప్పుడూ చూడలేదని విద్యార్థులు చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications