వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదికదా అమ్మప్రేమ: గుంతలో పడిన ఏనుగుపిల్ల కోసం మూర్ఛపోయిన తల్లి ఏనుగు, వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

అమ్మ ఎవరికైనా అమ్మే.. మనుషులకైనా, పశువులకైనా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. పిల్లలకు చిన్న కష్టం వచ్చిందంటే తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. అటువంటి వేదనతోనే మూర్చపోయిన ఓ తల్లి ఏనుగు కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన గున్న ఏనుగు పిల్ల లోతైన గుంత లో పడి ప్రమాదానికి గురవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన తల్లి ఏనుగు తల్లడిల్లి పోయిన ఘటన అమ్మతనానికి అద్దం పడుతుంది.

గుంతలో పడిపోయిన గున్న ఏనుగు పిల్ల .. తల్లడిల్లిన తల్లి ఏనుగు

థాయిలాండ్ లో నఖోన్ నాయక్ ప్రావిన్స్‌లో జరిగిన ఓ సంఘటన లో గున్న ఏనుగు పిల్ల ఒక గుంతలో పడిపోయింది. లోపల నుండి పైకి రాలేక సహాయం కోసం బిగ్గరగా కేకలు వేసింది. పైన ఉన్న తన తల్లిని చూస్తూ కాపాడాలని గున్న ఏనుగు పిల్ల ఘీంకారం చేసింది. బిడ్డను కాపాడడానికి తల్లి ఏనుగు శతవిధాల ప్రయత్నం చేసింది. వర్షం కారణంగా గుంత లోపలి భాగం జారుతుండటంతో గున్న ఏనుగు పైకి రాలేకపోయింది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన తల్లి తాను కాపాడలేని స్థితిలో ఎవరైనా కాపాడాలంటూ పెద్ద ఎత్తున ఘీంకారం చేస్తూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ గుంత చుట్టూ పరుగులు పెట్టింది.

బిడ్డ కోసం గుంతలోకి దిగి తల్లి ఏనుగు ప్రయత్నం.. ఒత్తిడిలో స్పృహ కోల్పోయిన తల్లి

బిడ్డ కోసం గుంతలోకి దిగి తల్లి ఏనుగు ప్రయత్నం.. ఒత్తిడిలో స్పృహ కోల్పోయిన తల్లి

ఆపై బిడ్డను కాపాడటం కోసం తాను కూడా పాక్షికంగా గుంతలోకి వెళ్ళింది. తానూ కూడా బయటకు రాలేకపోయింది. ఇక దీనిని చూసిన స్థానికులు సమీప అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు తల్లి ఏనుగును, గున్న ఏనుగు ను కాపాడడానికి రంగంలోకి దిగారు. బిడ్డను చూసి అరుస్తూ, రోదిస్తూ తల్లి ఏనుగు అక్కడే కుప్పకూలిపోయింది. థాయిలాండ్ నేషనల్ పార్క్ సిబ్బంది తన ఉన్మాదంగా ప్రవర్తిస్తున్న ఏనుగు మళ్లీ లేస్తే బిడ్డను బయటకు తీయడం ఇబ్బందిగా మారుతుందని భావించి తల్లి ఏనుగుకు మత్తుమందు ఇచ్చారు.

తల్లి ఏనుగును, పిల్ల ఏనుగును కాపాడిన రెస్క్యూ టీం

తల్లి ఏనుగును, పిల్ల ఏనుగును కాపాడిన రెస్క్యూ టీం

ఆపై రెస్క్యూ టీం క్రేన్ సహాయంతో గున్న ఏనుగును బయటకి తీయడంతోపాటు, తల్లి ఏనుగును కూడా కాపాడారు. బయటకు తీసిన తర్వాత తల్లి ఏనుగు లేవకపోవటంతో బిడ్డ ఏనుగు తల్లి ఏనుగు దగ్గరకు వెళ్లి తనను లేపే ప్రయత్నం చేసింది. తీవ్రమైన ఒత్తిడితో స్పృహ కోల్పోయిన తల్లి ఏనుగును తిరిగి కాపాడటం కోసం అధికారులకు సిపిఆర్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి సంవత్సరం వయసున్న గున్న ఏనుగు పిల్లను, తల్లి ఏనుగును బయటకు తీయడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఇక ఆపై తల్లి ఏనుగు, తన పిల్ల ఏనుగుతో సహా సంతోషంగా అడవి బాట పట్టింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. అమ్మ ప్రేమను కొనియాడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. అమ్మ ప్రేమను కొనియాడుతున్న నెటిజన్లు

ఇక ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. గున్న ఏనుగు పిల్ల పట్ల తల్లి ఏనుగు ప్రేమను నెటిజన్లు కొనియాడుతున్నారు. అంతేకాదు ఏనుగు పిల్లను కాపాడడానికి రెస్క్యూ టీం తీసుకున్న చర్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వాళ్లను నిజమైన హీరోలు గా అభివర్ణిస్తున్నారు.

English summary
The mother elephant fainted after struggling for the baby elephant that fell into the manhole. They were saved by the rescue team and this video went viral on social media. It mirrors the mother's love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X